60 ఏళ్ల వరకు బస్సు నడపాలంటే కష్టమే నన్న ఆర్టీసీ డ్రైవర్లు

ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును పెంచుతామని ఇటీవల కార్మికులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ ఇచ్చిన ఈ ఆఫర్‌ను ఆర్టీసీలోని డ్రైవర్లు మాత్రం 50 ఏళ్లు దాటగానే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే డ్రైవర్లు 60 ఏళ్ల వరకు బస్సు నడపాలంటే కష్టమేనని డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ప్రగతి భవన్‌లో అభిప్రాయాల సేకరణ కోసం ఓ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. అందులో కార్మికులు తమ అభిప్రాయాలను కాగితాలపై రాసి బాక్సులో వేశారు. చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు 60 ఏళ్ల వయసు నిబంధన వద్దని అందులో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం బస్సులు నడపడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు దృష్టి లోపాలు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, గుండె నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. డబుల్ డ్యూటీలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, గుండెపోటుతో డ్రైవర్లు స్టీరింగ్‌పైనే చనిపోతున్నారని వివరించారు. ఇలాంటి వారికి స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *