బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 69 మంది సజీవ దహనం కాగా… మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు… ఢాకాలోని చాక్‌బజార్‌లోని ఓ అపార్టుమెంటులో గురువారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. అయితే అదే అపార్టుమెంటులో ఓ కెమికల్‌ వేర్‌హౌజ్‌ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఇప్పటివరకు 69 మంది సజీవదహనమయ్యారు. మరో 50 మందిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. 37 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. గోదాం ఉన్న ప్రాంతంలో రహదారులు ఇరుగ్గా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. కాగా.. భవనాల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపకసిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సహాయకచర్యలు ఆటంకం ఏర్పడుతోంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న భవనంలో రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో ప్లాస్టిక్‌ గోదాంతో పాటు కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *