మీరే సిఫార్సు చేయండి అని రిక్వెస్ట్‌ చేస్తోన రష్మిక

మీరే సిఫార్సు చేయండి అని రిక్వెస్ట్‌ చేస్తోంది నటి రష్మిక మందన. ఎవరినో తెలుసా? రండి చూద్దాం ఈ అమ్మడి కథేంటో. కన్నడ గుమ్మ అయిన ఈ అమ్మడు తెలుగులో ఛలో, గీతగోవిందం చిత్రాలతో చాలా సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఈ చిత్రాలు అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే నటి రష్మికకు ఒక్కసారిగా క్రేజ్‌ వచ్చేసింది. ఇక ఆ మధ్య విడుదలైన మరో తెలుగు చిత్రం దేవదాస్‌ కూడా హిట్‌ అనిపించుకోవడంతో రష్మిక లక్కీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం కన్నడం, తెలుగు భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడి కన్ను ఇప్పుడు కోలీవుడ్‌పై పడింది. మరో విషయం ఏమిటంటే ఆ మధ్య రష్కిక కోలీవుడ్‌ ఎంట్రీ ఖారరైందనే ప్రచారం హోరెత్తింది. విజయ్‌తో రొమాన్స్‌ చేయబోతోందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే అవన్నీ రూమర్లే. వాటిని రష్మిక నిజం చేయాలని కంకణం కట్టుకుందట.ఎలాగైనా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ అమ్మడు తాజాగా తన ట్విట్టర్‌లో చాట్‌ చేసింది. అందులో ఒక అభిమాని తమిళంలో ఎప్పుడు నటిస్తారు అని అడగ్గా, తమిళ చిత్రాల్లో నటించాలని నాకూ ఆశగానే ఉంది. నాకు చాన్స్‌ ఇవ్వాలని దర్శక, నిర్మాతలకు మీరే సిఫార్సు చేయాలి అడిగింది.  అదేవిధంగా ఇళయదళపతి విజయ్‌ నటించిన చిత్రాల్లో మీకే చిత్రం అన్న ప్రశ్నకు..‘అబ్బో ఆ లిస్ట్‌ చాలానే ఉంది. ముఖ్యంగా గిల్లీ, తుపాకీ, తెరి, మెర్శల్‌ ఇలా నచ్చిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మీకో విషయం చెప్పాలి. నేను చిన్నతనంలో చెన్నైలోనే పెరిగాను. ఇకపోతే తమిళంలో త్వరలోనే నటిస్తాను ’అని రష్మిక మందన చెప్పుకొచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *