రివ్యూ: జూలీ2 హాట్‌ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. కానీ..

జూలీ2 కథ జూలీ ( రాయ్ లక్ష్మీ) దక్షిణాదితోపాటు హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. అశ్వినీ అస్థానా (పంకజ్ త్రిపాఠి) భార్య, సంఘ సేవకురాలు సుమిత్రా దేవీ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే ఓ జ్యూవెల్లరీ షాపులో జూలీపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఆ దాడిలో జూలీ మరణిస్తుంది. ఆ మరణం వెనుక అనేక అనుమానాలు తలెత్తడంతో ఏసీపీ దేవ్ దత్ (ఆదిత్య శ్రీవాస్తవ) దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ దర్యాప్తులో జూలీ మేకప్ మెన్ ఆనీ (రతి అగ్నిహోత్రి)ని కలువడంతో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తాయి.

జూలీని ఎవరు చంపారు? జూలీ హత్య వెనుక ఉన్న అసలు కారణమేమి? ఏసీపీ దేవ్ దత్‌కు దర్యాప్తులో ఎదురైన సంఘటనలు ఏంటీ? దర్యాప్తులో దేవ్ దత్‌కు ఎదురైన సమస్యలు ఎంటీ అనే విషయాలకు తెర మీద సమాధానమే జూలీ చిత్ర కథ.

విశ్లేషణ బాలీవుడ్ తార నేహా దూపియా నటించిన జూలీకి ఇది ప్రీక్వెల్ అని దర్శకుడు దీపక్ శివదాసనీ వెల్లడించారు. వాస్తవానికి ఈ చిత్ర కథ సినీ నటి జీవితంలో జరిగిన సంఘటనలతో కూడిన మర్డర్ మిస్టరీ. మర్డరీ మిస్టరీ చేధనలో ఉండే ఆసక్తి ఈ సినిమాలో కనిపించకపోవడం ప్రధాన లోపం. ఇక ఈ చిత్రంలో పేరు ఉన్న నటీనటులు లేకపోవడంతో పాత్రలు పేలవంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో దర్యాప్తు చాలా నీరసంగా సాగినట్టు అనిపించడం సహనానికి ఓ పరీక్షలా మారుతుంది.

సెకండాఫ్‌లో ఇక రెండో భాగంలో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా ఎలా మారిందనే అంశాన్ని హాట్ హాట్ సీన్లతో సినిమాను నడిపించాడు. ఇక క్లైమాక్స్ మర్డర్ వెనుక మిస్టరీ చాలా గందరగోళం, హడావిడి మధ్య ముగించే విధంగా అనిపిస్తుంది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొన్న వచ్చిన ప్రేక్షకులకు జూలీ2 సాదాసీదా మర్డర్ మిస్టరీ అనే నిరుత్సాహంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రాయ్ లక్ష్మీ తప్పిస్తే జూలీ2 చిత్రంలో రాయ్ లక్ష్మీ తప్పిస్తే మిగితా పాత్రదారుల పేర్లను వెతుక్కోవాల్సిన దుస్థితి కలుగుతుంది. పాత్రదారుల ఎంపికలో దర్శక, నిర్మాతలు కక్కుర్తి పడటం ద్వారా కథకు ప్రేక్షకుడు కనెక్ట్ కావడానికి చాలా కష్టపడాల్సిన సమస్య ఎదురవుతుంది

ప్లస్ పాయింట్
రాయ్ లక్ష్మీ గ్లామర్,నటన

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్
కథ, డైరెక్షన్
మ్యూజిక్

క్లైమాక్స్

నటీనటులు: రాయ్ లక్ష్మీ, రవికిషన్, ఆదిత్య శ్రీవాస్తవ, పంకజ్ త్రిపాఠి,రతి అగ్నిహోత్రి తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దీపక్ శివదాసని నిర్మాత: విజయ్ నాయర్, దీపక్ శివదాసనీ, పహ్లాజ్ నిహ్లానీ సంగీతం: విజుషా సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి రిలీజ్ డేట్: 24 నవంబర్, 2017

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *