వన్‌కే రన్‌లో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు

ఉగ్రవాదుల చర్యలకు బలైన భారత వీరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలుద్దామని ము థోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, భైంసా డీఎస్పీ రాజేష్‌భల్లా అన్నారు. గురువారం భైంసా సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో వీరజవాన్లకు నివాళులు అర్పించేందుకు నిర్వహించిన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. దేశం కోసం ప్రాణా లను త్యాగం చేస్తున్న జవాన్ల సేవలు అనిర్వచణీయమ న్నారు. ఎందరో మంది సైనికులు దేశం కోసం బలిదానం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వీర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పా టు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్వహించిన విరాళాల సేకరణకు అనూ హ్య స్పందన లభించింది. భైంసా పట్టణంలోని వివిధ వర్గా లు, సంఘాలకు చెందిన ప్రతినిధులు, నిర్వహకులు రూ.4 లక్షకుపైగా వీర జవాన్ల కుటుంబాల కోసం విరాళాలు అం దించారు. ఇందులో భాగంగానే గాంధీగంజ్‌ నుంచి నిర్మల్‌ క్రాస్‌ రోడ్డు వరకు 1కేరన్‌ నిర్వహించారు. ఈకార్యక్రమం లో డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డా. దామోదర్‌రెడ్డి, బీజేపీ ప్రతినిధి బాలాజీ సూత్రావే, టీఆర్‌ఎస్‌ ప్రతినిధి ము రళీగౌడ్‌, పీఆర్టీయూప్రతినిధి బీవీరమణరావు, టీయూటీ ఎ ఫ్‌ ప్రతినిధి నాగభూషణ్‌, మెడికల్‌ అసోసియేషన్‌, డాక్ట ర్స్‌ అసోసియేషన్‌, లయన్స్‌ క్లబ్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ అసోసి యేషన్‌, సాయినగర్‌ కాలనీ షటీల్‌ టీం, యోగా శిబిరం నిర్వహకులు, సభ్యులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు, బంగారు, వెండి వర్తక సంఘం, స్వర్ణకార సంఘం, సఫా బైతుల్‌మాల్‌, ప్రైవేటుస్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *