108 సంవత్సరాల రికార్డ్ మిస్: కోహ్లీ-జయంత్‌లపై ప్రశంసలు

ముంబై: భారత్ – ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ – జయంత్ యాదవ్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ 235 పరుగులు, జయంత్ 104 పరుగులు చేసి అవుటయ్యారు. 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ – జయంత్‌ల జోడీ రెండు పరుగులతో శతాబ్దానికి పైగా ఉన్న రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని చేజార్చుకుంది.

908లో ఆస్ట్రేలియా జోరీ హర్టింగన్‌-హిల్స్‌ ఎనిమిదో వికెట్‌కు 243 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 108 సంవత్సరాలైనా ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఈ రికార్డుకు చేరువలోకి వచ్చిన కోహ్లి-జయంత్‌ జోడీ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది.

ట్విట్టర్‌లో ప్రశంసల వెల్లువ 241 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ – జయంత్‌ల పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ప్రశంసలు కురుస్తున్నాయి. జయంత్ యాదవ్ తన తొలి టెస్టు మ్యాచులో సెంచరీ చేయగా, కోహ్లీ టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *