ఒకే రోజు 6 సినిమాలు విడుదల.. ఎందుకంటే..!

ఈ నెల 15వ తేదీన థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. ఎందుకంటే ఆ ఒక్కరోజునే 6 సినిమాలు విడుదలవుతున్నాయి. సునీల్ ‘ఉంగరాల రాంబాబు’.. సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్’.. నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘శ్రీవల్లీ’.. సచిన్ జోషి ‘వీడెవడు’.. ఇక అనువాద చిత్రంగా నయనతార – శింబు కాంబినేషన్లోని ‘సరసుడు’ ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ సినిమాలన్నీ ఒకే రోజున థియేటర్లకు రావడానికి కారణం ‘ జై లవ కుశ’ .. ‘స్పైడర్’ అనే అంటున్నారు. ‘జై లవ కుశ’ ఈ నెల 21న విడుదల కానుండగా, ‘స్పైడర్’ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 29న ‘మహానుభావుడు’ రంగంలోకి దిగనున్నాడు. దీనివల్ల థియేటర్స్ సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలన్నీ ముందుగానే ప్రేక్షకులముందుకు వస్తున్నాయన్నమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *