66వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు

చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం దక్షిణాది తారలతో కళకళలాడింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ తారలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డాన్స్‌లతో అదరహో అనిపించింది. 66వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలోని శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు స్టార్స్‌ సందీప్‌ కిషన్‌, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దక్షిణాది భాషల్లో 2018కి గాను ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు, అందులో నటించిన నటీనటులు, ఆ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలు అందించారు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా రామ్‌ చరణ్‌(రంగస్థలం), తమిళం నుంచి ధనుష్‌ (వడ చెన్నై), విజరు సేతుపతి(96) అందుకున్నారు. తెలుగులో ‘మహానటి’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్‌ అశ్విన్‌ ఉత్తమ దర్శకత్వ విభాగంలో అవార్డును అందుకున్నారు. ‘రంగస్థలం’లో తన నటనతో మెప్పించిన రామ్‌ చరణ్‌ ఉత్తమ కథానాయకుడిగానూ, మహానటిగా చేసి ప్రేక్షకాదరణ పొందిన కీర్తిసురేశ్‌ ఉత్తమ నటిగాను నిలిచారు. ‘అరవింద సమేత’లో జగపతిబాబు నటనకు ఉత్తమ సహాయ నటుడు, ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ పెర్ఫార్మెన్స్‌కు ఉత్తమ సహాయనటిగానూ అవార్డులు పొందారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగానూ(రంగస్థలం), అదే చిత్రంలో ఎంత చక్కగున్నావే…అనే గీతం రాసిన చంద్రబోస్‌ ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ‘భాగమతి’లో మందారా మందారా… అనే గీతాన్ని ఆలాపించిన శ్రేయా ఘోషల్‌ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్నారు. ‘రంగస్థలం’ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన రత్నవేలు సంబంధిత విభాగంలో ఉత్తమ అవార్డును అందుకున్నారు.
తమిళం నుంచి ‘పరియేరుమ్‌ పెరుమాల్‌’ ఉత్తమ సినిమాగానూ, రామ్‌ కుమార్‌ ఉత్తమ దర్శకుడిగానూ నిలిచారు. ధనుష్‌, విజరు సేతుపతి ఉత్తమ హీరోలుగానూ, ’96’లో పెర్ఫార్మెన్స్‌కు గానూ ఉత్తమ నటి విభాగంలో త్రిష నిలిచింది. ఐశ్వర్య రాజేశ్‌ బెస్ట్‌ క్రిటిక్‌ అవార్డు పొందారు. మలయాళం నుంచి సుందాని ఫ్రమ్‌ నిగేరియా ఉత్తమ సినిమాను, లిజో జోస్‌ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. జోజు జార్జ్‌, సౌబిన్‌ షాహిర్‌ ఉత్తమ నటీనటులుగా పురస్కారాలు పొందారు. కన్నడ నుంచి ‘కేజీఎఫ్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మ్యాన్‌సోర్‌ ఉత్తమ దర్శకుడిగానూ, కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌, శ్రుతి హరిహరణ్‌ ఉత్తమ నటీనటులుగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను పొందారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *