‘పారడైజ్ పేపర్స్’ ప్రకంపనలు..అమితాబ్ సహా 714 మంది నల్ల దొంగలు..!

నల్ల దొంగలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పనామా పేపర్స్ సృష్టించిన సంచలనం మరువక ముందే మరో సంస్థ ప్రకంపనలు తెపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్ల కుబేరుల జాబితాని బట్టబయలు చేసింది. తాజాగా సంచలనం సృష్టిస్తున్న ఆ సంస్థ పారడైజ్ పేపర్స్. ప్రపంచ దేశాల నల్ల కుబేరులతో పాటు ఇండియాలో పన్ను ఎగ్గొట్టి ఆస్తులు పోగేసుకున్న 714 మంది పేర్లని పారడైజ్ పేపర్స్ బయట పెట్టింది. దీనితో నల్ల కుబేరుల గుండెల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం ఎటొచ్చి తమ మెడకు చుట్టుకుంటుందనే టెన్షన్ లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది కాలం పూర్తి కానుంది. ఆ రోజుని యాంటీ బ్లాక్ మని డే గా ప్రభుత్వం జరపనుంది. దీనికి రెండు రోజుల ముందు ఈ వ్యవహారం బట్ట బయలు కావడంతో పారడైజ్ పేపర్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లతో పాటు ఇండియా కు చెందిన వారి పేర్లు కూడా లీక్ అవుతున్నాయి. ఈ జాబితాలో అమెరికా వాణిజ్య మంత్రి రోస్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అల్లుడు హోల్డింగ్స్ పేరుకూడా ఉన్నట్లు సమాచారం. ఇక భారతీయముల విషయానికి వస్తే బిగ్ బి అమితాబ్ పేరు, సంజయ్ దత్ భార్య మయంతి, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ల పేర్లు బట్ట బయలయ్యాయి. మితాబ్ విదేశాల్లో కంపెనీలతో అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరుకూడా ఈ జాబితాలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *