అమెరికాలో హైదరాబాదీకి అయిదేళ్ల జైలు శిక్ష…2.50 లక్షల డాలర్ల జరిమానా

అమెరికాలో హెచ్‌1బీ వీసాలకు సంబంధించి మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు హరి కర్నె దోషిగా తేలారు. అమెరికాలోని కోర్టు ఇతనికి అయిదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించింది. హరి మరికొందరు కలిసి అమెరికాలో పని చేయాలనుకుంటున్న కొందరు ఐటీ నిపుణులను ఉద్యోగంలోకి తీసుకున్నారు.

ఎస్సీఎం డేటా, ఎంఎంసీ సిస్టమ్స్‌లో పని చేసే విధంగా వీరికి హెచ్‌1బీ వీసాలను ఇప్పించారు. వీసాలకు దరఖాస్తు చేసేటపుడు వారిని అమెరికాలో పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని.. వారికి వార్షిక వేతనాలు ఇస్తామని తెలిపారు. కానీ అలా చేయలేదు. తాము ఉద్యోగంలోకి తీసుకున్న వీరిని మూడో పార్టీకి అప్పగించారు. తర్వాత వీరు సదరు కంపెనీల్లో ఉద్యోగుల పేరిట నకిలీ పే రోల్స్‌ సృష్టించారు. వీరికి జీతాలు ఇవ్వని రోజుల్లో నకిలీ సెలవు పత్రాలను కూడా సృష్టించారు. ఇవన్నీ అమెరికా కార్మిక శాఖ తనిఖీల్లో వెల్లడయ్యాయి. దీంతో ఎస్‌ఈఎం ప్రైవేట్‌ లిమిటెడ్‌లో యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ మేనేజర్‌గా పని చేస్తున్న హరికి కోర్టు జైలు శిక్ష విధించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *