మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన మహిళ

హర్యానా : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన మహిళపై హర్యానాలోని పాల్వా జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. 29 ఏళ్ల ఓ మహిళ తనపై ఓ బాలుడు అత్యాచారం చేశాడంటూ పాల్వా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు 14 ఏళ్ల మైనర్ కావడంతో అతడిని విడిచిపెట్టాల్సిందిగా కోర్టు పోలీసులకు సూచించింది. అయితే ఆ బాలుడిపై అత్యాచారం కేసు నమోదు చేసిన మహిళపైనే మైనర్‌పై అత్యాచారం చేసినందుకుగానూ కేసు నమోదు చేయాలని వారిని ఆదేశించింది.అసిస్టెంట్ సబ్‌ ఇన్స్‌పెక్టర్ అంజుదేవి మాట్లాడుతూ గతేడాది సెప్టెంబరులో ఓ మహిళ తనపై ఓ బాలుడు అత్యాచారం చేశాడంటూ కేసు నమోదు చేసిందని, దాంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అయితే అతడు మైనర్ కావడంతో అతడిని విడుదల చేసి, కేసు నమోదు చేసిన మహిళపైనే అత్యాచారం కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించిందని, ఆ మేరకు చర్యలు తీసుకుని విచారణ చేస్తున్నామని అంజుదేవి వివరించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *