వావ్.. 80’s టీం.. ఏం కలరింగ్

80’s రీ యూనియన్ అంటూ ఏటేటా ఆ దశాబ్దానికి చెందిన నటులు అంతా కలుస్తూ ఉంటారు. మాంచి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఏటేటా ఇలా అందరూ కలవడం.. కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడం.. సరదాగా సమయం గడపడం జరుగుతూనే ఉంది. గతేడాది చైనాలో.. అంతకు ముందు ఏడాది కొచ్చిన్ లో ఇలాంటి కలుసుకున్న 80ల నాటికి బ్యాచ్.. ఇప్పుడు మళ్లీ కలిశారు.

ప్రతీ ఏటా కొత్త థీమ్.. కలర్ కోడ్ తో ఆకట్టుకునే వీరు.. ఈసారి పర్పుల్ డ్రెస్ కోడ్ తో ఆకట్టుకున్నారు. ఈ గ్యాదరింగ్ కి చిరంజీవి.. వెంకటేష్.. శరత్ కుమార్.. జాకీ ష్రాఫ్.. భాగ్యరాజ్.. రాజ్ కుమార్.. అర్జున్..  నరేష్.. భానుచందర్.. సుమన్.. సురేష్.. రెహమాన్ లతో పాటు.. అలనాటి నటీమణులు అయిన.. సుహాసిని.. ఖుష్బూ.. రాధిక.. అంబిక.. జయసుధ.. పూనమ్ థిల్లాన్.. పూర్ణిమా.. పార్వతి.. సుమలత.. లిజీ.. రేవతి.. మేనక.. శోభన.. నదియాలు కూడా అటెండ్ అయ్యారు.

మొదట సౌత్ స్టార్స్ మాత్రమే ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు మెల్లగా బాలీవుడ్ నుంచి కూడా ఒక్కొక్కరూ జాయిన్ అవుతున్నారు. జాకీ ష్రాఫ్ అలాగే ఈ సారి టీంతో పాటు జతయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్నా నటించకపోయినా.. గత తరం నటులు అంతా ఇలా ఒకచోటకు చేరుకోవడం.. ఫోటోలకు పోజులు ఇవ్వడం.. అందరినీ ఆకట్టుకుంటోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *