పాపం…! అఖిల్ ఫస్ట్ లుక్ లీకయ్యింది

అక్కినేని అఖిల్.. హీరోగా అఖిల్ తోనే ఫెయిలయ్యాడు అయితే ఈ సారి మళ్ళీ కొత్త స్టైల్ లో ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు.అఖిల్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ ఫొటో ఒకటి ఇప్పుడు అక్కినేని అభిమానులను అలరిస్తోంది. ఇది లీక్ చేసిందా లేక లీకైందా అనే విషయం మాతం ఎవ్వరినీ అడగవద్దు.. ఎందుకంటే ఎవ్వరికీ తెలియదనే అంతా అనుకుంటున్నారు మరి…

చిత్ర యూనిట్‌ చాలా జాగ్రత్తగానే ఉందట కానీ లీకువీరులు అంతకంటే బలంగా ఉన్నారు, దాంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫస్ట్‌ లుక్‌ లీక్ ని ఆపలేకపోయారు. దీంతో సినిమా యూనిట్, అక్కినేని కాంపౌండ్ షాక్ కి గురైనా.. లీక్ అయితే నష్టమేముందిలే అని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని నాగ్ తెలిపారు.

21న బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. దానికి సంబంధించిన క్లూ ఇస్తారట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున సోషల్‌ మీడియాలో వెల్లడించారు. చిత్ర హీరో అఖిల్ కూడా ఫస్ట్ లుక్ లీకవడంతో షాకైనా.. ఫస్ట్ లుక్ ఫుల్ క్లారిటీ అంటూ ఓ స్టిల్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ స్టిల్ అయితే వెరైటీగానే ఉంది.

మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ అయిందనే వార్త వినిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొన్నటి వరకూ జున్ను అనే టైటిల్ ప్రచారంలో ఉండగా… తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా కోసం ‘రంగుల రాట్నం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టాక్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *