అప్పుడు నాగార్జున, ఇప్పుడు అఖిల్.. చెడగొట్టే పనులంటే ఇవే..?

అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రికిచ్చిన అఖిల్ తొలి చిత్రంతోనే పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. దీనితో తన తనయుడి కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగార్జున స్వయంగా తానే అఖిల్ రెండో చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. కాగా ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ హంగులతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. తాజాగా అఖిల్ సోషమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ చిత్ర షూటింగ్ కు సంబందించిన స్టిల్ వైరల్ గా మారింది. అఖిల్ సరదాగా కెమెరాతో ఈ స్టిల్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ.. దీనిపై విమర్శలు సైతం వస్తున్నాయి. వీటిని విమర్శలు అనేకంటే హెచ్చరిక అంటే ఇంకా బావుంటుందేమో..

అఖిల్ తొలి చిత్రం విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉందని, నాగ్ సూచించిన మార్పులతో వివి వినాయక్ కన్ఫ్యూషన్ కు గురయ్యాడనే వార్తలు ఉన్నాయి. అందువలనే చిత్ర అవుట్ ఫుట్ సరిగా రాక ఫెయిల్ అయిందని విమర్శించే వారూ లేకపోలేదు. తాజాగా అఖిల్ పోస్ట్ చేసిన షూటింగ్ స్పాట్ లో స్టిల్ పై కూడా లాంటి విమర్శలే వస్తున్నాయి. డైరెక్టర్ గా విక్రమ్ కుమార్, సినిమా టోగ్రాఫర్ పి ఎస్ వినోద్ ప్రతిభావంతులు ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ లో కుదురుకుని అఖిల్ వారి పనిలో వేలు పెట్టడం మంచిది కాదని, అలా చేస్తే తొలిచిత్రం రిజల్టే రిపీట్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *