‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ జోరుగా నమోదు

స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ జోరుగా నమోదు చేస్తోంది.  ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు పెద్దగా సత్తా చాటడం లేదు. అయితే ‘అల వైకుంఠపురములో’ అంచనాలకు మించి భారీ వసూళ్లు రాబడుతూ అందరికీ సర్ప్రైజ్ ఇస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అమెరికాలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అలాగే విడుదలైన తొలిరోజు(ఆదివారం) ఉదయానికే ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. శుక్రవారం ఉదయానికి యూఎస్‌లో ‘అల.. వైకుంఠపురములో..’దర్శకుడు త్రివిక్రమ్‌కు వరుసగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన నాల్గో మూవీగా నిలిచింది. ఇంతకుముందు ఆయన డైరెక్ట్ చేసిన ‘అరవింద సమేత’, ‘అజ్ఞాతవాసి’, ‘అఆ’ చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి. కాగా, బన్నీకి మాత్రం ఇదే తొలి రెండు మిలియన్ డాలర్ల సినిమా. అలాగే పూర్తి రన్ టైమ్‌లో ఈ సినిమా మూడు మిలియన్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *