కళ్యాణ్ రామ్ తరువాతి సినిమా ప్రకటన !

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా మారినప్పటి నుండి కాస్త ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఈ మధ్య సోదరుడు జూ.ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర్నుండి ఆ పనుల్లోనే మునిగిపోయిన అయన ఎట్టకేలకు వీలు చూసుకుని తన కొత్త సినిమాను అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ ప్రకటన రేపు హైదరాబాద్లో జరగనుంది. ‘దూకుడు, బాద్షా, పటాస్’ వంటి సినిమాలకి పని చేసిన ఉపేంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాని భారత్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్దిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇందులో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *