పవన్‌ ఫ్యాన్స్‌కు గాలం వేసిన బన్నీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిసి అన్నాడో, తెలియక అన్నాడో.. లేదా ఫ్లోలో అన్నాడో గానీ పవర్ స్టార్ గురించి మాట్లాడను అని చెప్పడం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారకుడయ్యాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి బన్నీ అంటేనే చాలు తెగ ఫైర్ అయిపోతున్నారు పవన్ అభిమానులు. ఆ ఆగ్రహాన్ని ఇటీవల విడుదలైన డీజే-దువ్వాడ జగన్నాథం టీజర్‌పైనే చూపించేశారు. ఎన్ని లైకులు కొట్టారో.. దాదాపు అన్నే డిస్‌లైకులను కొట్టేశారు పవన్ అభిమానులు. తాజాగా ఆ టీజర్ వ్యూస్ కోటి మార్కును అందుకుంది.

వరుస హిట్స్ తో టాలీవుడ్ మొత్తం మీద సూపర్ ట్రాక్ లో ఉన్న అల్లు అర్జున్.. ఈ డిస్‌లైక్స్‌ ప్రభావం డీజే మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడని టాక్. అదేలాగా అంటే తన డీజే సినిమాలో పవన్‌ను పొగుడుతున్నట్టు ఉండే కొన్ని డైలాగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఆ డైలాగులు త్వరలో విడుదల కాబోయే ట్రైలర్‌లో కూడా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట. ఈ మేరకు దర్శకుడు హరీష్‌ శంకర్‌కు సూచనలు కూడా ఇచ్చాడటని టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

ఇక పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ని గుర్తు తెచ్చే సీన్స్.. దువ్వాడ జగన్నాధంలో హైలైట్ అవుతాయని తెలుస్తోంది. స్వతహాగా పవన్‌కల్యాణ్‌ అభిమాని అయిన హరీష్‌ శంకర్‌ ఆ పనిలో ఉన్నాడని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే పవన్‌ ఫ్యాన్స్‌ కూల్‌ అయిపోవడం ఖాయంగానే అనిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *