ట్విట్టర్ నే ఇంటికి రప్పించిన మెగాస్టార్

ఇప్పుడు టైంకి ఫుడ్ బెడ్ లేకపోయినా నడుస్తుందేమో కాని సోషల్ మీడియా అప్ డేట్స్ లేకపోతే మాత్రం పిచ్చెక్కిపోయే బాపతు ఇండియాలో కోట్లలో ఉన్నారు. అందరితో అనుసంధానం కావడానికి ఇదో చక్కని వేదికగా మారడంతో సెలెబ్రిటీలు సైతం వ్యక్తిగతంగా టీంలను అప్పాయింట్  చేసుకుని మరీ వీటిని నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఇదే ట్రెండ్. దేశంలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ లైన్ లో ఉన్న బిగ్  బి అమితాబ్ బచ్చన్ కు ఒకరోజు హటాత్తుగా తన ఎకౌంటులో అభిమానుల సంఖ్య అమాంతం తగ్గిపోవడంతో ఆగ్రహం చెంది తాను అక్కడి నుంచి నిష్క్రమిస్తాను అని బెదిరించిన సంగతి తెలిసిందే. హమ్ సినిమాలో తన చేతిలో ఒక రౌడీ దెబ్బలు తినే ఫోటోను పోస్ట్ చేసి ట్విట్టర్ కు ఇదే గతి అని అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం బాగా వైరల్ అయ్యింది.

దీంతో అమితాబ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోతారేమో అని భయపడ్డ ట్విట్టర్ వెంటనే తన టీంను రంగంలోకి దింపింది. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది – ఏ ప్రాతిపాదికన తాము లెక్కలు వేస్తాము – ఎందుకు ఫాలోయర్స్ తగ్గారు లాంటి వివరాలు క్షుణ్ణంగా బిగ్ బికి వివరించేందుకు స్వయంగా ఎక్స్ పర్ట్స్ ని పంపించింది. వాళ్ళతో ఉన్న ఫోటోను ఆయన షేర్ చేసుకున్నాక ఇది బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది. అసలే సోషల్ మీడియా యాప్స్ మధ్య పోటీ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ట్విట్టర్ లాంటి సంస్థలు బిగ్ బి లాంటి వ్యక్తులను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే ఎన్నడు లేనిదీ బాలీవుడ్ హీరో కోసం అదే దిగివచ్చింది.

దీంతో బిగ్ బి కోపం చల్లారినట్టే అనుకోవచ్చు. నిత్యం సినిమాల గురించి సమాజంలో జరుగుతున్న వాటి గురించి తనదైన శైలిలో రెగ్యులర్ గా స్పందించే అలవాటు ఉన్న బిగ్ బి ట్విట్టర్ నుంచి వెళ్ళిపోతే ఎలా అని ఖంగారు పడ్డ అభిమానులు ఇది విని రిలాక్స్ అవుతున్నారు. అంతే మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు బిగ్ బి తలుచుకుంటే ఎవరైనా రాజీకి రావలసిందే.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *