ఏడవలేక నవ్వుతున్న అనసూయ

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ పరిస్థితి ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నట్టు ఉంది. విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అనసూయ గళం విప్పిన సంగతి తెలిసిందే. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపడం న్యాయమేన అంటూ అనసూయ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీ్ట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను అనసూయ ట్యాగ్ చేశారు. అయితే, జోగు రామన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి అనుకొని అనసూయ ఆయన్ని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే. దాంతో తన తప్పును తెలుసుకున్న అనసూయ ఆయనకు ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.

అయితే సోషల్ మీడియా మొత్తంలో అనసూయ.. జోగు రామన్నకు క్షమాపణలు చెప్పిన వార్తలతోనే నిండిపోయిందట. ఈ విషయాన్ని అనసూయ ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. ‘హ్హ హ్హ.. ఏడవలేక నవ్వుతున్నా. ఇఫ్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తే అన్నీ.. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సారీ చెప్పిన అనసూయ’ అనే వార్తలే ఉన్నాయి. ఇందుకు కదా మనం ఎటూ కాకుండాపోయింది. దేని గురించి ఫోకస్ పెట్టాలి దేని గురించి పెడుతున్నారు? అసలు ఎప్పుడు బాధ్యతగా ఫీల్ అయ్యేది?’ అని ప్రశ్నించారు. అనసూయ అభిప్రాయంలో ఆమె చెప్పింది నిజమే అని కొందరు అంటుంటే, కొండేరు అనసూయ చేసిన ట్వీట్ల గురించి చెప్పినప్పుడు అందులో నల్లమల అడవుల సమస్యను కూడా మీడియా వర్గాలు కవర్ చేస్తున్నాయి కదా అంటున్నారు. అసలు ఆమె దేని గురించి ట్వీట్ చేశారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాంటప్పుడు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అని ప్రశ్నించడం సబబుగా అనిపించడంలేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. ఆ తర్వాత నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *