నిశ్చితార్ధానికి ముహూర్తం ఫిక్స్‌….

కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల నిశ్చితార్థం జనవరి1వ తేదిన చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం సమాచారం. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో న్యూఇయర్ వేడుకల్నిసెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట.. నూతన సంవత్సరం రోజున నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారట. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌, నరేంద్ర నగర్‌లోని ఆనంద రిసార్ట్‌లో వీరిద్దరి ఎంగ్‌జ్‌మెంట్‌ జరగనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులతోపాటు సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, అనిల్‌ అంబానీ కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అమితాబ్‌, జయా బచ్చన్‌, అనిల్‌లు ఇప్పటికే డెహ్రాడూన్‌ చేరుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అనుష్క,విరాట్‌ ముంబయి నుంచి గురువారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడినుంచి ఆనంద రిసార్ట్‌కు చేరుకున్నారు.

ఇదే రిసార్ట్‌లో కోహ్లీ-అనుష్క జోడీ ఈనెల 24 నుంచి ఉంటున్నారు. ప్రముఖులు బసచేసిన ఈ రిసార్ట్‌కు భద్రతను పెంచినట్టు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ తెలిపారు. కాగా బుధవారం కోహ్లీ జంట హరిద్వార్‌లోని ఓ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. అక్కడ ఆశ్రమ గురు అనంత మహరాజ్‌తో ఫొటో కూడా దిగారు. ఈ ఫోటోలో అనుష్క ఒకే రకమైన రుద్రాక్ష గొలుసు వేసుకుని దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఈ ఫోటో చూస్తుంటే విరాట్‌,అనుష్కల నిశ్చతార్ధం ఏర్పాట్ల‌న్నీ వేగంగా జ‌రుగుతున్నట్లు తెలుస్తుంది.

గతంలో కూడా సుల్తాన్‌ విడుదల తర్వాత అనుష్కశర్మ -విరాట్‌ కోహ్లీల నిశ్చతార్ధం ఉంటుందని వార్తలు వచ్చాయి అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా ఈ వార్తలపై నిజం ఎంత తెలియాలంటే జనవరి1వ తేది వరకు ఆగాల్సిందే.

virat-anushka
virat-anushka

విరాట్‌కు జనవరి 15 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుండటంతో ఈ లోగా నిశ్చితార్థానికి అనువుగా ఉంటుందని ఈ తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా, 2010లో వన్డే కెప్టెన్‌ ధోనీ వివాహం కూడా డెహ్రాడూన్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *