అరుణ్ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల సంతాపం

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీ నుండి ఢీల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ,సినీ ప్రముకులు సంతాపం తెలియజేస్తున్నారు.

  • అరుణ్‌జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోంది. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు. మా కుటుంబ సభ్యుడినే కోల్పోయినంత బాధగా ఉంది. నన్ను ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఆయన’- కేంద్ర మంత్రి అమిత్‌ షా
  • ‘అరుణ్‌ జైట్లీ రాజకీయ దిగ్గజం. అత్యున్నత మేధో సంపత్తి గల వ్యక్తి. దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత. ఆయన మృతి విచారకరం. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా’ అని మోదీ సంతాపం తెలిపారు.
  • ‘అరుణ్‌ జైట్లీ మృతి తీవ్ర విచారకరం. ఆయన ఓ గొప్ప లాయర్‌, పార్లమెంటేరియన్‌. విశిష్టమైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’ – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
  • ఆర్థిక వ్యవస్థను అంధకారం నుంచి వెలుగులోకి తెచ్చి, సరైన గాడిలో పెట్టిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ట్వీట్‌ చేశారు.
  • కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రజా నాయకుడిగా సుదీర్ఘకాలం ఆయన సేవలందించారు. గొప్ప పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా ప్రజలకు ఆయన అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం’ -కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ
  • ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు.జైట్లీ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
  • జైట్లీ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భవగంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
  • భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బాధను వ్యక్తపరిచేందుకు మాటలు రావట్లేదని ఆవేదన చెందారు. ‘అరుణ్‌జైట్లీ మరణవార్త నన్ను ఎంతో కలిచివేసింది. ఈ బాధను వ్యక్తపరిచేందుకు మాటలు రావట్లేదు. జైట్లీ గొప్ప రాజకీయ నేత. అద్బుతమైన ప్రతిభ ఆయన సొంతం. అన్నింటికంటే మించి మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని శక్తికాంతదాస్‌ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలియజేశారు.
  • అరుణ్‌ జైట్లీ మరణ వార్త తీవ్రంగా బాధించిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘గొప్ప పార్లమెంటేరియన్‌. న్యాయకోవిదుడు. పార్టీలకతీతంగా అభిమానుల్ని సంపాదించున్నారు. భారత రాజకీయాలకు ఆయన చేసిన సేవలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *