బిగ్ బాస్-3 హౌస్ నుండి ఆషూరెడ్డి అవుట్

బిగ్ బాస్-3 మొదలయ్యి ఇప్పటికీ 5 వారాలు అయ్యింది. ఇప్పటికే నాలుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆషూరెడ్డి అని సమాచారం. ఇది ఆషూ అభిమానులకు చేదు కబురే అయిన తప్పదు మరి. కేవలం సోషల్ మీడియాలో డబ్ స్మాష్ లు చేసి ఫేమ్ అయ్యిందని, తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో పెట్టారు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలాంటి ఫేమ్ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడిప్పుడే అటు టాస్క్ ల్లో ఇటు బిగ్ బాస్ హౌస్ విషయంలో చురుగ్గా పాల్గొంటున్న ఆషూరెడ్డి ఎలిమినేట్ అవ్వటానికి కారణాలు ఏమిటని చూస్తే…ఒక రకంగా ఆషూరెడ్డి బిగ్ బాస్ హౌస్ లో చేసిన పనుల గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమి లేవని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 5 వారాల్లో మూడు వారాలు ఆషూరెడ్డి ఎక్కడ ఉందా అని వెతుకు కోవలసిన పరిస్తితి ఉంది ప్రేక్షకులకి. కేవలమ రెండు వారాల నుండే కాస్త చురుగ్గా, జోష్ పెంచింది ఆషూ. అది కూడా నేనే రాజు నేనే మంత్రి టాస్క్ లో డ్రాగన్ ఎగ్ ని సొంతం చేసుకోవడం తప్ప, కానీ దాన్ని కూడా అరా నిముషం కాపాడుకోలేకపోయింది. ఆ ఒక్కటి తప్ప ఇంకా మరే ఏ టాస్క్ లోని ఆషూ కనిపించిన ఆనవాళ్ళు లేవు.

అయితే రీసెంటుగా జరిగిన సెలబ్రిటీ ఆఫ్ ది వీక్ లో మాత్రం కాస్త తానెంటో నిరూపించుకొనే ప్రయత్నం చేసింది. కానీ గొప్పగా ఆకట్టుకున్నది అయితే ఏమి లేదు. ఇక ఇంటి విషయంలో…నేనంటూ ఒకదాన్ని ఇన్నానని చూపించడానికి వేరే వాళ్ళ గొడవలో పెద్ద మనిషిలా నిలదీస్తాను అంటూ ముందుకొస్తుందే తప్ప..అది కూడా మధ్యలోనే ఆపడం ఆషూకి మైనస్ గా చెప్పొచ్చు.మొత్తానికి 5 వారాల్లో ఆషూకి అందరితో కలవడానికి 3 వారాలు పడితే మిగిలిన 2 వారాల్లో పెద్దగా ఆకట్టుకున్నది ఏమి లేదు. కనీసం మచ్చుకు చెప్పుకోవడానికి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడ ఆషూ మార్క్ లేదు. టాస్క్ ల్లో పెర్ఫమెన్స్ ఏమి లేదు, గొడవల్లో ఉండనే ఉండదు, కామెడీ అసలే లేదు, ఎంటర్ టైన్ మెంట్ కూడా ఏమి లేదు. మరిక ఏ రీజన్ తో ఆషూని హౌస్ లో ఉంచాలో అనికున్నారేమో…అటు ప్రేక్షకులు, ఇటు బిగ్ బాస్ అందరూ కలసి అమ్మడును అవతలికి పంపేసరు. ఇక ఆషూని బయటకు పంపడం శివజ్యోతి లో కాస్త నిరుత్సాహం నింపుతుందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రోహిణి,ఆషూ,శివజ్యోతిలు ఫ్రెండ్స్ గా ఉంటే…రోహిణి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆషూ కూడా…దాన్ని బట్టి చూస్తే శివజ్యోతి క్రుంగిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏది అమైన హౌస్ లోకి వచ్చింది ఆటకోసం కాబట్టి ఒక్కొక్కరిగా అందరూ వెళ్లిపోవాల్సిందే. ఈ వారం ఆషూ వచ్చే వారం ఇంకొకరు అంతే…

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *