అశ్విన్ కొత్త రికార్డు

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కొత్త రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన రికార్డును త‌న పేరిట రాసుకున్నాడు. 51వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌.. కెరీర్‌లో 11 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు చేశాడు. ఇక టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు తీసుకున్న నాలుగో భార‌త ప్లేయ‌ర్‌గా అత‌డు నిలిచాడు. క‌పిల్ దేవ్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, అనిల్ కుంబ్లే త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో ఇండియ‌న్ ప్లేయ‌ర్ అశ్విన్‌. అంతేకాదు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో 2 వేల ప‌రుగులు, 200 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న వారిలో అశ్విన్ స్థానం నాలుగు. ఇయాన్ బోథ‌మ్, ఇమ్రాన్ ఖాన్‌, క‌పిల్ దేవ్ త‌ర్వాత అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 52 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *