తిరుమలకు దీటుగా అయోధ్యలో

 అమిత్ షా కీలక ప్రకటన సోమవారం కీలక ప్రకటన చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరాన్ని నాలుగు నెలల్లో భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. తిరుమలకు దీటుగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దుతామని గతంలో బీజేపీ నేతలు మాటిచ్చారు. అయోధ్య తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ 18 రివ్యూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా వీటన్నింటిని ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.అయోధ్యలో మసీదు నిర్మాణానికి వీలుగా ఐదెకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *