బాహుబలి-2 అమ్మకాల వివరాలు..!

తొలిభాగం విజయాన్ని ఎవరూ ఊహించలేదు. అది వాస్తవం. సినిమా సమర్పకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో సహా. తొలిభాగాన్ని నిర్మాతలయిన తన సన్నిహిత బంధువులు డెఫిసిట్‌తో విడుదల చేస్తున్నపుడు రాఘవేంద్రరావుకు చాలాకోపం వచ్చిందట. వందకోట్ల సినిమా తీసి, డెఫిసిట్‌లో విడుదల చేయడమా? ఇంకెందుకు సినిమా తీయడం అని ఆగ్రహంతో అని అలిగి, అమెరికా వెకేషన్‌కు వెళ్లిపోయారన్నది ఇండస్ట్రీ గుసగుసల్లో ఒకటి.

బాహుబలి విడుదలకు ముందు ఓ బయ్యర్‌ బోలెడు అప్పుల్లోకి వెళ్లారట. అప్పుల కారణంగా మొహం చాటేసుకు తిరిగే పరిస్థితి. అయితే ఎప్పుడో పాత కమిట్‌మెంట్‌తో ఆయనకు ఓ ఏరియా హక్కులు దొరికాయి. బంగారపు గని దొరికినట్లయింది. అప్పుల వాళ్లను పిలిచి మరీ తీర్చారట బాకీలు మరో నిర్మాత కమ్‌ బయ్యర్‌ అయితే బాహుబలి విడుదలకు ముందు కాస్త గట్టిదెబ్బలే తిన్నారు. విడుదల తరువాత మళ్లీ ఆయన కొత్త కరెన్సీ నోటులా కళకళలాడారు. బాహుబలి విడుదల వల్ల థియేటర్ల సంగతి ఎలా వున్నా, సైకిల్‌ స్టాండ్‌లు, క్యాంటీన్లు భయంకరంగా ఆదాయం చేసుకున్నాయి. కొందరు కార్లు కొన్నారని, కొందరు స్థలాలు కొన్నారని రకరకాల కబుర్లు వినిపిస్తుంటాయి  ఇండస్ట్రీలో.

బాహుబలి పార్ట్‌-1 అమ్మకాలు
నైజాం     -23 కోట్లు
సీడెడ్‌      -13 కోట్లు
వైజాగ్‌     -7 కోట్లు
ఈస్ట్‌    -5 కోట్లు
వెస్ట్‌      -4.5 కోట్లు
కృష్ణ       -4 కోట్లు
గుంటూరు    – 6 కోట్లు
నెల్లూరు     -3.5 కోట్లు
కర్నాటక     -12 కోట్లు
ఓవర్‌ సీస్‌     -11 కోట్లు
రెస్టాఫ్‌ ఇండియా -26 కోట్లు

రాజమౌళి మీదున్న నమ్మకం
బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌, సెకెండ్‌ పార్ట్‌లో రెండింటిలోనూ అసోసియేట్‌ అయిన బయ్యర్లలో సాయి కొర్రపాటి ఒకరు. దర్శకుడు రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన.  ఇంత బజ్‌ వచ్చాక ఎవరన్నా ఎక్కువ డబ్బులు పెట్టి సెకెండ్‌ పార్ట్‌ కొంటారు. కానీ బజ్‌ అంతగా లేనపుడే ఫస్ట్‌పార్ట్‌ను మూడు, నాలుగు ఏరియాలకు కొన్నారు ఆయన. అదే విషయమై ప్రశ్నిస్తే, ‘… రాజమౌళి కథ గురించి చెప్పినపుడే డిసైడ్‌ అయ్యాను ఇది ఓ సంచలనం సృష్టిస్తుందని. అలాగే జరిగింది. ఆ ధైర్యంతోనే కొన్నాను. రాజమౌళి చెప్పినది ఎలా తీస్తారో నాకు తెలుసు. అలాగే నభూతో నభవిష్యతి అన్నట్లు రూపొందింది బాహుబలి.

ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. సినిమా కొంచెమైనా చూసారా? ఎలా అనిపించింది అని అడిగితే, నవ్వేసి…” చూసారా? లేదా? అని మాత్రం అడొగొద్దు, కానీ ఒకటి మాత్రం చెబుతా.. బాహుబలి పార్ట్‌-2 కూడా నభూతో నభవిష్యతి అన్నట్లు వుంటుంది…’ అన్నారు సాయి కొర్రపాటి.

బాహుబలి-2 అమ్మకాలు
ఇండస్ట్రీలో వినవస్తున్న వార్తల ప్రకారం బాహుబలి 2 ఆంధ్ర, నైజాం అమ్మకాలు ఈ విధంగా వున్నాయి.

ఉత్తరాంధ్ర      -13 కోట్లు
ఈస్ట్‌          -11 కోట్లు
వెస్ట్‌              -9,5 కోట్లు
కృష్ణ              -9 కోట్లు
గుంటూరు     -12 కోట్లు
నెల్లూరు        -5.5 కోట్లు
సీడెడ్‌    -25 కోట్లు
నైజాం    – 45 (అడ్వాన్స్‌)
మొత్తం ఏపీ తెలంగాణ -130 కోట్లు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *