బాహుబలి2 సెలబ్రిటీ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్…

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా రివ్యూ ముందే వచ్చేసింది. భారతీయ చిత్రాలను ముందే చూసే యూఏఈకి చెందిన సినీ విమర్శకులు ఉమేర్ సంధూ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశారు. బాహుబలి2 సినిమాకు 5 స్టార్లు ఇవ్వడం విశేషం. మంగళవారం రాత్రి దుబాయ్‌లో ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా, చూడముచ్చటగా ఉంది అని ట్వీట్ చేశారు. సెకండాఫ్ చూసిన తర్వాత భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని చిత్రం బాహుబలి అని ఉమేర్ పేర్కొన్నారు.

హాలీవుడ్ లో అద్భుతంగా రూపొందిన చిత్రాలకు దీటుగా బాహుబలి రూపొందింది. వీఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రధానంగా బాహుబలి2 స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రభాస్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. రానా, అనుష్క, తమన్నా యాక్టింగ్ ఫెంటాస్టిక్. సత్యరాజ్ నటన అమోఘం అని ఉమేర్ తన బ్లాగ్‌లో రివ్యూ రాశారు.

బాహుబలి ఫస్టాఫ్ ముగిసింది. సినిమా కన్నుల పండువగా ఉంది. టెర్రిఫిక్. ఒక్క సీన్ కూడా వృథాగా లేదు. హ్యాట్సాఫ్ టూ ప్రభాస్.బాహుబలి2 సెకండాఫ్ కూడా ముగిసింది. ఇప్పటివరకు భారత్‌లో నిర్మితమైన అద్భుతమైన చిత్రాల్లో బాహుబలి ఒకటి. శుక్రవారం భారతీయ సినిమా చరిత్ర తిరుగరాయడం తథ్యం. బాహుబలి అల్ టైమ్ బ్లాక్ బస్టర్

యూఏీ సెన్సార్ బోర్డులో వేసిన ప్రీమియర్‌లో బాహుబలి2 స్టాండింగ్ ఓవేషన్. భారత సినీ పరిశ్రమకు సంబంధించిన గర్వించే క్షణాలు అవి. జై హింద్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *