కేసీఆర్ స్టైల్ ను బాబు కాపీ కొట్టారా?

కేసీఆర్ స్టైల్ ను బాబు కాపీ కొట్టారా? అవును. అదే సందేహం కలుగుతుంది పై రెండు ఫొటోలు చూస్తుంటే. తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి గత డిసెంబర్ లో సామూహిక గృహప్రవేశం చేయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింప్లిసిటీని ఓ రేంజ్ లో ఇష్టపడే కేసీఆర్ ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్లే కేసీఆర్ అలా దారి వెంట వెళ్తూ అక్కడే ఉన్న రావిచెట్టు దగ్గర కూర్చున్నారు. ఆ ఇమేజ్ బాగానే పాపులర్ అయింది. ఒక సీఎం ఎంత సింపుల్ గా కూర్చుండిపోయారని చర్చ జరిగింది. అయితే ఇపుడు బాబు సైతం అదే రీతిలో రచ్చబండ అనేదగిన లోకేషన్ లో భైఠాయించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయ నూతన భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రావిచెట్టు వద్ద కూర్చున్న చంద్రబాబు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన నేరుగా ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి – తల్లిదండ్రులు మనకెన్నో ఇచ్చారు.. అలాగే పెద్దలు – గురువులు జ్ఞానాన్ని పంచారు. వీరందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని కూడా ఈ సారి జన్మభూమిలో చేపట్టినట్లు వెల్లడించారు. తొలుత ప్రకృతికి ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ తర్వా జ్ఞానాన్నిచ్చిన గురువులు – పెద్దలు – ఆ తర్వాత సమాజం – ప్రభుత్వం – ప్రజాప్రతినిధులు – అధికారులకు ఈ సభల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. అలాగే జీవన ప్రమాణాల మెరుగుకు 15సూత్రాల్ని రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమానికి పరిధులు తొలగించామని అవసరాల్లో ఉన్నవారందర్నీ ఆదుకుంటున్నామన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *