బాలయ్య 102 టైటిల్ ఇదేనా??

నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాను చేసిన తరువాత దూకుడు పెంచేశారనే చెప్పాలి. ”గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా తరువాత ఆయన అదే స్పీడులో పూరి జగన్ డైరక్షన్లో తన 101వ సినిమాను కూడా చేసేశారు. అయితే ‘పైసా వసూల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చినా కూడా.. ఇప్పుడు బాలయ్య మాత్రం అదే ఏమాత్రం తన స్పీడు తగ్గించకుండా 102వ సినిమాను కూడా చేసేస్తున్నారు.

ప్రముఖ తమిళ డైరక్టర్ కె.ఎస్.రవికుమార్ డైరక్షన్లో బాలయ్య ఒక సినిమాను శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన రామోజీ ఫిలిం సిటీలో మొదలైన ఈ సినిమా.. ఆ తరువాత తమిళనాట కూడా షూటింగ్ జరుపుకుంది. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు.. ఒక పాత్రకు జోడీగా నయనతారను తీసుకున్నట్లు మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడుతున్నారో తెలుసా?

అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు.. బాలయ్య తన 102వ సినిమాకు ”కర్ణ” అనే పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టైటిల్ వేరొకరి దగ్గరక ఉండటంతో.. ”NBK కర్ణ” అంటూ తన సినిమాకు నామకరణం చేయాలని ఆయన ఫిక్సయ్యారట. అయితే ప్రస్తుతానికి యునిట్ సభ్యులు ఈ టైటిల్ పై సీక్రెసీ మెయిన్టయిన్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *