కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ

దశాబ్దాల పాటు వివక్షకు గురై అన్ని రంగాల్లో అణగారిన తెలంగాణ, ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ కేవలం  ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి ద్వారానే పునర్నిమాణం సాధ్యమనీ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల పునరుద్ఘాటించారు.

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ ఎన్నో ప్రయాసలకొనర్చి, తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి, మొక్కవోని దీక్షతో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కతాటిపై నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కె సి ఆర్  ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమనీ, దానిలో భాగంగానే నేడు తెలంగాణాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశానికి హాజరైన సభ్యులకు  వివరించారు.

అధికార దాహంతో, ప్రతిపక్షాలతో కుమ్మక్కై కొందరు కె సి ఆర్ గారిపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వీటిని సామాజిక మాధ్యమాల ద్వారా మరింతగా వ్యాప్తి చేసే గురుతర బాధ్యత టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా తమ భుజ స్కందాలపై వేసుకొందని వివరించారు. తమ భవిష్యత్ కార్యక్రమాలను, ప్రణాళికలను సభ్యులతో చర్చించారు. క్రమశిక్షణతో తెలంగాణలోని తమ పార్టీ అభ్యున్నతికై సర్వదా కృషి చేస్తామనీ, తెలంగాణ పునర్నిమాణంలో తమవంతు సహాయ సహకారాలను అందించడానికి ఎల్లవేళలా ముందుంటామని పార్టీ సభ్యులు ప్రతిజ్ఞబూనారు.

విక్టోరియా స్టేట్  కన్వీనర్ సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు అనిల్ రావు ,టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ సభ్యులు డా.అర్జున్ , అమర్ రావు చీటీ , సత్యం రావు, అభినయ్ కనపర్తి ,ఈవెంట్స్ ఇంచార్జి ప్రకాష్ సూరపనేని, మైనారిటీ సెల్ ఇంచార్జి జమాల్ మహమ్మద్, యూత్ వింగ్ కన్వీనర్ సనిల్ రెడ్డి బాసిరెడ్డి

విక్టోరియా కో ఆర్డినేటర్లులు ప్రవీణ్ లేడల్లా,కళ్యాణ్ ఐరెడ్డి, క్రాంతి, సభ్యులు రమాకాంత్ ,వేణు నాథ్, సాయి యాదవ్,రమేష్ నందలి , మహేష్ రెడ్డి బద్దం , సంజీవ రెడ్డి రాయిరెడ్డి, వినోద్ గోపిడి,వినోద్ , కృష్ణ , సంతోష్ రెడ్డి , శ్రీనివాస్ లక్కం, నరేష్ , ప్రసాద్ ఆకుల,  మరియు మెల్బోర్న్ లోని వివిధ సంఘాల నాయకులైన తెలంగాణ మధు ,రాంపాల్ ముత్యాల , పుల్ల రెడ్డి, ప్రవీణ్ దేశం , సతీష్ పాటి , మరియు ఇతర నాయకులు ఈ సమావేశానికి తమ మద్దతును తెలుపుతూ పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *