పొట్టి క్రికెట్లో ట్రిపుల్ ధమాకా

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. ఎవరికి సాధ్యం కానీ రితీలో ఢిల్లీ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లరకు కూడా సాధ్యం కాని విధంగా కేవలం 72 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ  కొట్టి మోతమోగించాడు. ఢిల్లీలోని లలిత పార్క్‌లో మావి ఎలెవన్‌.. ఫ్రెండ్స్‌ ఎలెవన్‌ మధ్య మ్యాచ్‌ ఈ అరుదైన ఇన్నింగ్స్‌కు వేదికైంది. మావి ఎలెవన్‌ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగి ప్రత్యర్థి బౌలర్లను ఎడాపెడా బాదిన మోహిత్‌.. ఇన్నింగ్స్‌ చివరి రెండు ఓవర్లలో 250 నుంచి 300 మార్క్‌ చేరుకోవడం విశేషం. మోహిత్ సాధించిన  ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా స్టార్ గా మారి దేశం దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు.

ఆఖరి ఓవర్‌ చివరి ఐదు బంతులను సిక్స్‌లుగా మలిచిన ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఘనంగా ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 72 బంతుల్లో  (300 నాటౌట్‌; 72 బంతుల్లో 14×4, 39×6) రికార్డు స్కోరు నమోదుచేశాడు.  టీ20లో ఏ స్థాయిలో అయినా ఇదే అత్యధిక స్కోరు. మోహిత్‌ భీకర బ్యాటింగ్‌తో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న మావి ఎలెవన్‌ 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 416 పరుగులు చేసింది.

కేవలం సిక్సర్లతోనే (39) మోహిత్‌ 234 పరుగులు చేయడం విశేషం. 14 ఫోర్లు కూడా కలుపుకుంటే బౌండరీలతోనే అతను 290 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మావి ఎలెవన్‌ 216 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ర‌పున క్రిస్‌గేల్ 66 బంతులు ఆడి 163 ప‌రుగులు చేశాడు. మ‌రోవైపు అంత‌ర్జాతీయ టీట్వంటీ మ్యాచుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 63 బంతుల్లో 156 ప‌రుగులు చేశాడు. ఈ ఘ‌న‌త‌ను ఫించ్ ఇంగ్లాండ్ జ‌ట్టుపై సాధించాడు. అంతేకాదు ట్వంటీ ట్వంటీల్లో ఏ జ‌ట్టు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 300 ప‌రుగులు చేయ‌లేదు. ఇప్ప‌టి వ‌రకు టీట్వంటీల్లో న‌మోదైన ఒక జ‌ట్టు అత్య‌ధిక స్కోరు 263 ప‌రుగులు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *