డేరా ఆశ్ర‌మంలో మ‌గాళ్లను నపుంసకులను చేసేవాడు

‘‘జైలు శిక్ష పడిన డేరా బాబా రాంరహీం సింగ్‌ చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఆశ్రమంలో ఉన్న తన పురుష అనుచరులందరినీ డేరా బాబా నపుంసకులను చేసేశాడు. బలవంతంగా వారి వృషణాలను తొలగింపచేసి…ఎందుకు పనికిరాని వారిగా తయారు చేశాడు. మరోవైపు తాను(డేరాబాబా) మాత్రం ఆశ్రమంలోని సాధ్విలందరిపైనా వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడేవాడు. వారి ఆక్రందనలు, ఆక్రోశాలేవీ అతడిని కదిలించలేకపోయేవి. అత్యంత దారుణంగా మానభంగాలు చేసి వారందరినీ ఆశ్రమంలోనే బందీలుగా ఉంచేవాడు’’… ఒకప్పుడు సిర్సాలో డేరాబాబా అంగరక్షకుడిగా పనిచేసిన బియాంత్‌ సింగ్‌ ఒళ్లు జలదరింపచేసే ఈ వివరాలన్నిటినీ వెల్లడించాడు. అందుకు సంబంధించిన టేపులు ఇప్పుడు వెలుగుచూశాయి. 18న నిముషాల ఆ వీడియో టేపు చూసిన వారికెవరికైనా డేరా బాబా అకృత్యాలు తెలిసి వెన్నులో చలిపుట్టుకొస్తుంది.

సాధ్విలంతా కూడా అదేదో దైనందిన క్రతువులాగా బాబా గదిలోకి వెళ్లేవారు. అక్కడ అతడు ఆదేశించిన అభ్యంతరకరమైన పనులన్నిటినీ చేసేవారు. 1995లో మౌంట్‌ అబూ వెళ్లినపుడు ముక్కుపచ్చలారని ఓ పదహారేళ్ల అమ్మాయిని బాబా గదికి తీసుకు వచ్చారు. ఆమెను గదిలో బందీగా పట్టుకున్న బాబా కొన్ని గంటలపాటు… అసహాయురాలైన ఆ అమ్మాయిపై అత్యాచార అకృత్యాన్ని కొనసాగించాడనీ…అందుకు తానే సాక్ష్యమనీ బియాంత్‌ సింగ్‌ చెప్పాడు. కేకలుపెడుతూ…ఏడుస్తూ…ప్రాధేయపడుతున్న ఆ పదహారేళ్ల పసిదానికి జరిగిన అన్యాయానికి అక్కడున్న సెక్యూరిటీ గార్డులందరూ కూడా ప్రత్యక్ష సాక్షులేనని బియాంత్‌ సింగ్‌ చెప్పారు. ఒక్కరం కూడా ఆరోజు ఆ అన్యాయాన్ని అడ్డుకునే సాహసం చేయలేకపోయామన్నారు. ఇప్పటికీ ఆమె డేరాలో బందీగా ఉందన్నారు.

‘ఆరోజు పారిపోయాను’ : చివరకు తనను కూడా సంసారానికి పనికిరాని పురుషుడిగా…నపుంసకుడిగా తయారుచేసేందుకు రంగం సిద్ధమవడం చూసి భయంతో పారిపోయినట్లు బియాంత్‌ చెప్పాడు. ప్రాణభయంతో చివరకు విదేశాలకు వెళ్లిపోయానన్నాడు. చంపేసి…ఆశ్రమంలోనే పూడ్చిపెట్టేవారు: హత్యలు డేరా ఆశ్రమంలో ఒకరకంగా నిత్యకృత్యమేనని చెప్పాడు. తొలిసారిగా ఫకీర్‌చంద్‌ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసి ఆశ్రమంలోనే పూడ్చేశారన్నారు. ఆ తర్వాత చంపిన వారందరినీ పక్కనే ఉన్న పఖ్రా నదిలో పడేసేవారని చెప్పారు. ఆ తర్వాత ఆశ్రమ ప్రాంగణంలో పూడ్చిపెట్టడాలు జరిగేవని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబా ‘ ఓ సైతాను’ అని బియాంత్‌ పేర్కొన్నాడు.
డేరాలో భారీ ఎత్తున నల్లధనం నిల్వలున్నట్లు చెప్పారు. నిరుపేదల భూములను కబ్జాచేసి భారీ ఆశ్రమాన్ని నిర్మించారన్నారు. భూమి సొంతదారులకు ఏదో కాస్త ముట్టజెప్పారని కూడా బియాంత్‌ సింగ్‌ వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *