బిగ్ బాస్-3 స్వాతంత్ర్య దినోత్సవ సంభరాలు

బిగ్ బాస్-3 26వ ఎపిసోడ్ బాబా బాస్కర్ తన స్నేహితుడైన జాఫర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో మొదలయ్యింది. హౌస్ నుండి వెళ్ళాక నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ శ్రీముఖితో కలసి జాఫర్ కు విషెస్ చెప్పారు. తరువాత వితిక, వరుణ్ సందేశ్ మధ్య చిన్న గొడవ అయ్యింది. గిన్నెలు కడుగుతున్న వరుణ్ ని అలా కాదు ఇలా అని చెప్పడంతో వరుణ్ వీటికపై సీరియస్ అయ్యాడు. నీ పని నువ్వు చెయ్ నా పని నేను చేస్తాననే సరికి వితిక తను కిచెన్ సెషన్ నుండి వెళ్లిపోతానని అంటుంది. దీనితో అక్కడే ఉన్న పునర్నవి మీరిద్దరు ఇలా గొడవ పడితే నేనే వెళ్లిపోతా అనేసరికి వితిక తనపై సీరియస్ అయ్యింది. తను ఎప్పుడు ఎలా చేయొద్దు అలా చేయాలి అని చెప్తుందని తనతో కలసి పని చేయలేనని, తను బ్రేక్ ఫాస్ట్ సెషన్ చూస్తే నేను లంచ్ సెషన్ చూస్తాను అని అసహనం వ్యక్తం చేస్తుంది. దీనితో హిమజ కూడా తను కిచెన్ లో ఎవరి మాట వినదని శ్రీముఖి తో అంటుంది.

తరువాత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ రెండు టిమ్ లుగా విడిపోయి స్కిట్స్ వేశారు.  స్త్రీ పురుష సమానత్వంపై వారిని స్కిట్ వేయమని చెప్తారు. మొదట మహేశ్, రవి, వితిక, పుననవి, అషులు మగవారు గొప్ప, ఆడవారు గొప్ప అనే దానిపై స్కిట్ తో అదరగొట్టారు. మగవారు ఎవరితోనైనా, ఎప్పుడైన మాట్లాడవచ్చు అని మహేశ్, రవి వాదిస్తే దానిపై వితిక, పునర్నవి, అషులు రెచ్చిపోయారు. ఆడవాళ్ళు పెళ్లి అనే ఒక్క కరణంతో అన్నీ వాదులుకొని త్యాగం చేస్తున్నారు అని ఆషూ రెడ్డి అనగా, ఆడపిల్లల చదువులోను, పెంపకంలోను అణిచివేతను గూర్చి మాట్లాడింది. పునర్నవి ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ అంటూ స్పీచ్ ఇచ్చింది. సమాజంలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఆడవాళ్లకు లేదా అంటూ నిలదీసింది. పొరపాటు పది నిమిషాలు ఫోన్ మాట్లాడినా ఎవడితో మాట్లాడుతున్నావ్ అంటారు. ఒక అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది సోషలైజింగ్ అంటారు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అంటారు. ఇదీ అమ్మాయిలకు మీరిచ్చే గౌరవం అంటూ ఆవేశంగా మాట్లాడింది. అనంతరం మిగిలిన కంటెస్టెంట్స్ మరో స్కిట్‌తో అలరించారు. పుట్టిన దేశాన్ని, కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి విదేశాలకు వెళ్లే వాళ్లకు కౌంటర్ ఇస్తూ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు. ఇక చివర్లో మంచి ఊపినిచ్చే దేశభక్తి పాటలకు స్టెప్పులేస్తూ బిగ్ బాస్ హౌస్‌ని హోరెత్తించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *