బిగ్ బాస్-3 ఎవరు ఎలిమినేట్ అయ్యారు?

బిగ్ బాస్ శనివారం నటి ఎపిసోడ్ లో నాగార్జున చాలా సీరియస్ గా ఉండి క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే, అయితే ఆదివారం ఎపిసోడ్ మాత్రం చాలా సరదాగా సాగింది. మొదట అందరీకి ఇది ఫన్ డే అని చెప్పిన నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ అంకితం నీకే అంకితం అనే గేమ్ ను ఆడించారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ ముందున్న కవర్లలో ఒకటి తీసి పేపర్‌పై ఉన్న పాటను చూడాలి. దాన్ని బయటికి చదవకుండా ఆ పాటను మిగిలిన హౌస్‌మేట్స్‌లో ఎవరికో ఒకరికి అంకితం ఇవ్వాలి. వారితో కలసి ఆ పాటకు డాన్స్ వెయ్యాలి. చివరిగా వారికి ఎందుకు అంకిత చేశారో కారణం చెప్పాలి. ఈ గేమ్ లో బాబా భాస్కర్ తన స్టెప్పులతో సందడి చేశారు. తమన్నాతో ఒక్కమగాడు సాంగ్‌కు స్టెప్పులేసిన బాబా, రోహిణి, హిమజలతోనూ అంతే జోష్‌తో డ్యాన్స్ చేశారు. ఇక పునర్నవితో రవికృష్ణ, మహేష్ డ్యాన్స్ చేసినప్పుడు ఎక్కడో కాలుతున్న వాసన వస్తోందంటూ రాహుల్‌ను ఉద్దేశించి నాగార్జున సరాదాగా ఆటపట్టించారు. మహేష్‌తో పునర్నవి డ్యాన్స్ చేసే సమయంలో అయితే అలీ ఏకంగా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్‌ను తీసుకొచ్చేశారు. అదెందుకు అని నాగార్జున అడిగితే కాలిపోయిన వాసన వస్తోంది సార్ ఒకవేళ మంటలు వస్తే ఆర్పుదామని సరదాగా సమాధానం ఇచ్చారు అలీ. మొత్తానికి ఈ గేమ్ చాలా సరదాగా సాగింది.

గేమ్ మధ్యలో అషురెడ్డి ని స్టోర్ రూంలోకి వెళ్లి అక్కడున్న సూట్‌కేసును దానిపై ఉన్న పేరును చూపించకుండా తీసుకురమన్నారు. ఆ తర్వాత నాగార్జున ఐదు అంకెలు లెక్కపెట్టి రాహుల్ పేరు చెప్పారు దీనితో ఈ వారం ఎలిమినేషన్‌లో మొదటిగా సేఫ్ జోన్‌లోకి వెళ్లింది రాహుల్. ఆ తరవాత పునర్నవిని సేఫ్ జోన్‌లో వేశారు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ని వేదిక పైకి నాగార్జున ఆహ్వానించారు. కానీ హౌస్‌లో ఉన్నవారెవరూ నవ్వలేదు దానితో వెన్నెల కిషోర్ సార్ అప్పుడే నా కెరీర్  అయిపోయింద అన్నారు దానికి నాగార్జున వారిని నవ్వితే బయటకు పంపిస్తా అని చెప్పలే అన్నారు. ‘‘నాకే డిప్రెషన్‌గా ఉంది సార్. కాస్త నవ్వమని చెప్పండి’’ అని కిషోర్ రిక్వెస్ట్ చేశారు. దీంతో హౌస్‌మేట్స్ నవ్వించడానికి వారికి ‘మన్మథుడు 2’ ట్రైలర్ వేసి చూపించారు. కిషోర్ ద్వారా సేఫ్ జోన్‌లోకి వెళ్లిన మూడో వ్యక్తి పేరును ప్రకటించారు. ఆ మూడో వ్యక్తి బాబా భాస్కర్. ఆ తర్వాత బాబా గారిని సూట్ కేస్ తెమ్మని ఆయనతో డాన్స్ వేయించారు. ఆ తరవాత తమన్నా, వితికాలలో తమన్నా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ప్రేక్షకులు తమన్నాకే తక్కువ ఓట్లు వేసినట్లు నాగార్జున చెప్పారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తమన్నా ఎంతో జోష్‌తో వేదికపైకి వచ్చారు. ఈ షోలోకి వచ్చి తాను చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. ఆ తరవాత తమన్నాకు నాగార్జున ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న వాళ్ల ఒక్కో హౌస్‌మేట్ ఫొటోను చూపిస్తూ వాళ్ల గురించి ఒక్క నిమిషంలో ఆగకుండా మాట్లాడమన్నారు. దానికి తమన్నా అందరి గురించి మాట్లాడుతూ బాబా గారి గురించి ‘‘నా తల్లి, నా తండ్రి, నా గురువు అన్నీ బాబా భాస్కర్. నిజంగా బాబా భాస్కర్‌కే నేను పుట్టుంటే సూపర్ లేడీ అయ్యేదాన్ని’’ అని ఎమోషనల్ అయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *