బిగ్ బాస్-3 లో రోహిణి ఎలిమినేట్

ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తితో 29ఆ ఎపిసోడ్ మొదలయ్యింది. మాస్క్‌ లు తొలగించుకుని మీరు మీలాగా ఉండాలనిదాన్ని హౌస్ మేట్స్ ఎంతవరకూ పాటిస్తున్నారు, వాళ్లు ఇంకా నటిస్తూ మాస్క్‌ లతోనే నటిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి బిగ్ బాస్  హౌస్‌ని కోర్టుగా మార్చేశారు. ఏలిమినేషన్‌లో ఉన్న ఐదుగురు టెస్ట్ పెట్టి వాళ్లు మాస్క్‌ తీసి ఉంటున్నారో లేదో అని వారికి సరదా టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం లాయర్లు, జడ్జ్‌ లు, నిందితులుగా సెపరేట్ చేశారు. నాగార్జున ఒక పేరు చెప్పి వాళ్లు హౌస్‌లో ఎందుకు ఉండకూడదో కారణం చెప్పాలని వాదనలు వినిపించాలని కోరారు. బాబా భాస్కర్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో చెప్పాలని మహేష్ విట్టాను వాదించాల్సింది లాయర్ బాధ్యతలు అప్పగించారు. అయితే మహేష్ వాదనల్ని అబ్జెక్ట్ చేస్తూ.. వీటికి నేను ఒప్పుకోను అంటూ సరదాగా ఆటపట్టించారు బాబా భాస్కర్. గేమ్‌లో భాగంగా రాహుల్ ఈ హౌస్‌లో కొనసాగటానికి ఎందుకు అర్హత లేదో ప్రాసిక్యూట్ చేయాలని పునర్నవికి బాధ్యతలు అప్పగించారు నాగార్జున. ఎప్పుడూ నవ్వుతూ గేమ్‌ని సీరియస్‌గా ఆడడు. ఇంట్లో ఉన్నవి మొత్తం తినేస్తాడు అంటూ వాదించింది పునర్నవి. జడ్జ్‌ గా ఉన్న శివజ్యోతి అతను తింటున్నాడు అంటే ఈమె ప్రేమగా పెట్టడం వల్లే.. రాహుల్‌ ఎవర్నైనా ఏమైనా కావాలంటే రాత్రి 11 అయితే వెంటనే లేచి ఇస్తుంది అంటూ పంచ్ పేల్చింది. ఏదో ప్రేమతో పెడుతున్నాం.. పైగా నేను కిచెన్‌ టీమ్‌లో ఉన్నాను కాబట్టి తినిపించా ఏదో ప్రేమగా అంటూ కవర్ చేసుకుంది పునర్నవి. ఆమె వాదనలు విన్న హౌస్ మేట్స్.. నిజమే ఆమె ఏదో ప్రేమగా చేస్తుందిలే అంటూ ఇన్ డైరెక్ట్‌ పంచ్ పేల్చేరు. అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురు బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌‌లలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. తర్వాత రోహిణిని  నాగార్జున హోసే మేట్స్ అందరికీ పాయింట్స్ ఇన్నమంటే వారికి పాయింట్స్ ఇచ్చి అవి ఎందుకు ఇస్తుందో కూడా చెప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *