బిగ్ బాస్-3: కంటతడి పెట్టిన బాబా భాస్కర్

బిగ్ బాస్-3 30వ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొదట మొదటిగా ఈ నామినేషన్స్ ప్రక్రియకు కెప్టెన్ అలీకి మినహాయింపు లభించింది. దీంతో పాటు ఆయనకు నలుగుర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అలీ నామినేట్ చేసి నలుగురు కంటెస్టెంట్స్ అతన్ని మెప్పించి అతని మనసు మార్చడానికి ప్రయత్నించాలని.. ఫైనల్‌గా అలీ మనసు మార్చుకుని ఒకరి పేరును సూచించమని చెప్పారు బిగ్ బాస్. దీంతో అలీ బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వీతికా పేర్లను చెప్పాడు. కాగా అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి బాబా భాస్కర్ ప్రయత్నించారు. కానీ హిమజ- అలీ ల మధ్య డిస్కషన్ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో.. ఎప్పుడూ నీతో నాకు డిస్కషన్ ఏంటో నాకూ అర్ధం కావడంలేదన్నారు. తర్వాత నామినేషన్ ప్రారంభమైంది.

మొదట పునర్నవి హిమజని, రాహుల్ ని నామినేట్ చేసి దానికి కారణాలు చెప్పింది. అలాగే, బాబా భాస్కర్ ఆశు, రాహుల్ లను,…రవి రాహుల్, హిమాజాలను….వీతికా  మహేశ్,ఆషులను…శ్రీముఖి రాహుల్,ఆషులను…రాహుల్ హిమజ, శ్రీముఖిలను…అషు హిమజ,రాహుల లను…వరుణ్ రాహుల్,మహేశ్ లను…శివజ్యోతి పునర్నవి,రాహుల్ లను…మహేశ్ రాహుల్,వరుణ్ లను…హిమజ పునర్నవి,ఆషులను…అలీ బాబా భాస్కర్ ను నామినేట్ చేశారు. ఇక ఈవారం రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

అయితే అలీ బాబా భాస్కర్ ని నామినేట్ చేయడంలో బాబా భాస్కర్ భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టారు. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయన ఇలా కంటతడి పెట్టడం ప్రేక్షకుల్ని కూడా భావోద్వేగానికి గురి చేసింది. తాను ఎప్పుడూ ఎలాగే ఉంటానని.. బిగ్ బాస్ కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని.. అలీ తనను నామినేట్ చేసిన పర్లేదు కాని.. అతను చెప్పిన కారణానికి చాలా బాధగా ఉందంటూ శ్రీముఖి దగ్గర ఏడ్చేశారు బాబా భాస్కర్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *