బిగ్ బాస్-3: నీ ఇంటికి రాలేదు…బిగ్ బాస్ ఇంటికి వచ్చా…

బిగ్ బాస్-3 31వ ఎపిసోడ్ లో మహేశ్ కి ఆలికి మధ్య గొడవ అయ్యింది. అసలు విషయానికి వస్తే శ్రీముఖి వరుణ్ తో బాబా భాస్కర్ చాలా ఫీల్ అయ్యారని ఏడ్చారని చెప్పింది. వరుణ్, శ్రీముఖి మధ్య వర్తులుగా బాబా, అలీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.  అయితే మధ్యలో మహేష్ కల్పించుకుని ఆయన ఫీల్ అయ్యారని అనడంతో నువ్ మధ్యలో పుల్లలు పెట్టకు అని అలీ నోరు జారడంతో మహేష్ సీరియస్ అయ్యారు. ఇద్దరూ ఒకర్నొకరు దూషించుకుంటూ.. కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. దీనితో వాళ్లను బాబా భాస్కర్, వరుణ్‌, రవిలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడితే పుల్లలు పెడుతున్నా.. అని అంటున్నారు? నేను నీ ఇంటికి రాలేదు.. బిగ్ బాస్ ఇంటికి వచ్చా.. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దెబ్బలు తింటావ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహేష్ విట్టా.  మధ్యలో బాబా భాస్కర్ కల్పించుకుని అలీ పశ్చాత్తాప పడుతున్నాడు అంటూ మహేష్ బయటకు తీసుకువచ్చేశాడు. ఇక రాహుల్ సైతం తనను నామినేట్ చేయడంపై బాబా భాస్కర్, మహేష్‌ల దగ్గర బాధపడ్డారు.

ఈ గొడవ ముగిసిన తర్వాత వితికా, వరుణ్ ల పెళ్లి రోజు కావడంతో హౌసులో సంబరాలు నిర్వహించారు. మాటే మంత్రమూ అని రాహుల్ పాట అందుకుంటే వితికా వరుణ్‌లు ఒకర్నొకరు హగ్ చేసుకుని పెళ్లి రోజు సంబరాలు జరుపుకున్నారు. ఈవారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉండేందుకు మహిళలకు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఎప్పటిలాగే బజర్ మోగడం వెళ్లి చైర్‌లో కూర్చోవడం.. ముందువెళ్లి కూర్చున్న వాళ్ల తొలి ఇద్దరి మధ్య కెప్టెన్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో వితికా, శివజ్యోతికి కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. క్రైన్ సాయంతో ఇద్దర్నీ స్విమ్మింగ్ ఫూల్ పై నుండి గాల్లోకి లేపి.. వాళ్లు కందికి రాకుండా వాళ్లు వాటర్‌కి టచ్ కాకుండా చూడాలని ఎవరు ఎక్కువ సేపు గాల్లో ఉంటే వాళ్లే విజేతలు అంటూ గాలి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఎక్కువ సేపు గాల్లో ఉండి కెప్టెన్ అయ్యింది శివజ్యోతి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *