బిగ్ బస్స్-3 ఏదేమైనా నీ ఇల్లా?…అవును నా ఇల్లే…

బిగ్ బాస్-3 33వ ఎపిసోడ్ లో నిన్న మొదలయిన టాలెంట్ షోలోని రెండవ భాగం నిర్వహించారు. దీనికి బాబా భాస్కర్, శ్రీముఖి లు జద్జెస్ గా వ్యవహరించారు. నిన్నటి జరిగిన మొదటి రౌండ్ లో నుండి నాలుగురిని రెండవ రౌండ్ లోకి ఎంపిక చేశారు. ఆ నలుగురు కంటెస్టెంట్స్ అలీ,మహేష్,రవి కృష్ణ,వరుణ్ సందేశ్. రెండవ రౌండ్ జడ్జెస్ పర్ఫమెన్స్ తో మొదలయింది. బాబా భాస్కర్, శ్రీముఖి పంచదార బొమ్మ పాటకు డాన్స్ వేసి అలరించారు. ప్రేమించిన అమ్మయని ఒక యాక్సిడెంట్ లో కోల్పోయే కన్సెప్టుతో అలీ ఒక స్కిట్ చేసి అక్కడ అందరినీ భావోద్వేగానికి గురి చేశాడు. తరవాత వచ్చిన మహేష్ విట్ట డబ్బు మాట్లాడగలిగితే దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చేసి చూపించాడు. మూడో పెర్ఫార్మర్‌గా రవి వేదికపైకి వచ్చాడు. ‘ప్రేమిస్తే’ సినిమాలోని భరత్ క్యారెక్టర్‌ను ఆయన చేసి చూపించాడు. ప్రేయసి కోసం పిచ్చోడిగా మారిన ప్రియుడి పాత్రను బాగా చేసి చూపించాడు. వచ్చీ రాగానే ‘మీ ముగ్గురిలో ఒకరే గెలవాలి. నేను లైట్. అందుకే సరదాగా ఒక పాట పాడేస్తా’’ అని ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే’ పాటను ఆలపించాడు. ఈ నాలుగు పెర్ఫార్మెన్సులు చూసిన జడ్జెస్.. అలీ, రవిలను వేదికపైకి పిలిచారు. వీళ్లిద్దరిలో ఎవరు విజేతో చెప్పాలని ఇంటి సభ్యులకే అవకాశం ఇచ్చారు. ఏడుగురు అలీకి ఓటేయగా.. ముగ్గురు రవి వైపు నిలబడ్డారు. దీంతో అలీని విజేతగా ప్రకటించారు.

బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఇంటి సభ్యులు తమ ఫిర్యాదులను కంప్లైంట్ బాక్సులో వేశారు. ఇంటి సభ్యుల్లో ఎవరిపైనైనా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులను సేకరించి ఇంటి కెప్టెన్ అందరి ముందు చదివి వినిపించి పరిష్కరించాలి. వీటిని కెప్టెన్ శివజ్యోతి ఇంటి సభ్యుల ముందు చదివి వినిపించింది. ముందుగా మహేష్ విట్టపై వచ్చిన ఫిర్యాదులను శివజ్యోతి చదివింది. ‘‘ఆయనకు అవసరంలేని విషయాల్లోకి దూరి అనవసరమైన సలహాలు ఇచ్చి సమస్యను ఇంకా రెచ్చగుడుతున్నడని’ అని శివజ్యోతి కంప్లైంట్‌లో ఉన్న విషయాన్ని చదివి వినిపించింది.దీని తరవాత మరో కంప్లైంట్ కూడా మహేష్‌పైనే వచ్చింది. ‘‘తను మిగతా సభ్యుల విషయంలో జోక్స్ చేస్తున్నాడు. అనవసరమైన రిప్లైస్, ఒపీనియన్స్ ఇవ్వడంలో ముందుంటున్నాడు. అని శివజ్యోతి కంప్లైంట్‌ను చదివి వినిపించింది. ఇది రాసింది తానేనంటూ పునర్నవి పైకి లేచింది. అలాంటప్పుడు, అనవసరంగా వేరే వాళ్ల విషయంలో దూరి సలహాలు ఇవ్వొద్దని, ఇదే తన కంప్లైంట్ అని చెప్పింది. దీంతో మహేష్ కాస్త హర్ట్ అయ్యాడు. ‘‘అంటే నేను మాట్లాడొద్దు. అంతేనా’’ అని అన్నాడు.

ఆ తరవాత అలీపై వచ్చిన కంప్లైంట్‌ను శివజ్యోతి చదివి వినిపించింది. ‘‘హౌస్‌మేట్స్‌ ని తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వకపోవడం.. హీరో అవ్వడానికి బిగ్ బాస్ నియమాలు తప్పడం’’ అని శివజ్యోతి వెల్లడించింది. ఇది మహేష్ రాసిన కంప్లైంట్.  దీనితో మహేష్ – అలీ మధ్య వాదోపవాదాలు జరిగాయి. అది కూడా చాలా అగ్రెసివ్‌గా. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కంట్రోల్ తప్పారు. ‘‘ఫస్ట్ ఎవడ్రా అరిచింది.. ఇదేమైనా నీ ఇల్లనుకున్నావేంట్రా. వాడేమంటే అది నేను పడాలా?’’ అంటూ మహేష్ ఊగిపోయాడు. దీంతో అలీ.. ‘‘అవును ఇది నా ఇల్లే అనుకున్నా’’ అంటూ తన స్టైల్లో చెప్పాడు. మొత్తానికి మరోసారి మహేష్, అలీ మధ్య పచ్చగడ్డి భగ్గుమంది.

ఆ తరవాత రాహుల్‌పై శ్రీముఖి రాసిన కంప్లైంట్‌ను శివజ్యోతి చదివింది. రాహుల్‌తో తనకు ఇంకా గ్యాప్ ఉందని, దాన్ని పూడ్చుకునేందుకే ఈ కంప్లైంట్ అని కూడా రాసింది. దీన్ని పాజిటివ్‌గా తీసుకున్న రాహుల్.. శ్రీముఖిని హగ్ చేసుకున్నాడు. ఫిర్యాదులు ఎక్కువగా మహేష్, రాహుల్‌పై రావడంతో వీరిద్దరినీ తక్షణమే జైళ్లో పెట్టాలని కెప్టెన్ శివజ్యోతిని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో మహేష్, రాహుల్ జైళ్లోకి వెళ్లారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *