బిగ్ బాస్ నుండి అలీ ఎలిమినేట్…ఏడ్చిన ఇంటి సభ్యులు

బిగ్ బాస్-3 50వ ఎపిసోడ్ లో అనుకోని విధంగా ఆలీరాజ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ జింగిడి జింగిడి అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు. మన టివిద్వారా హౌస్ మేట్స్ ని పలకరించారు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన నానిని నాగార్జున మంచి పాటతో ఆహ్వానించారు. ఇద్దరు కలసి స్టెప్పులేశారు. తరువాత నాని మన టీవి ద్వారా హౌస్ మేట్స్ ని పలకరించాడు. నానిని పెన్సిల్ పార్ధసారధిగా పరిచయంచేశారు నాగార్జున. ఇంటి సభ్యులందరిని వింతగా పరిచయం చేసుకోమన్నారు. అలాగే నాని కూడా ఒక స్క్రిప్ట్ అని ఒక్కొక్కరికి ఒక రోల్ ఇచ్చారు.

ఇలా అందరికీ ఒక్కో రోల్ ఇచ్చేసిన తరవాత ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్‌ను బిగ్ బాస్ ఇంటిలో ఉన్నవారందరికీ వేసి చూపించారు. ట్రైలర్‌ను చాలా ఆనందంగా వాళ్లంతా చూశారు. సూపర్ అన్నారు. నానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తరవాత నాగార్జున ఎడమ చేతిపై వేయించుకున్న టాటూను నాని రివీల్ చేశారు. అనంతరం అందరికీ బైబై చెప్పి వెళ్లిపోయారు. ఇక తరువాత ఎలిమినేషన్ లో భాగంగా నామినేషన్‌లో ఉన్న అలీ, శ్రీముఖి, రవి, మహేష్‌లను నాగార్జున యాక్టివిటీ రూంలోకి వెళ్లమన్నారు. అక్కడ నలుగురిని వరుసగా నిలబెట్టి లైట్ ఎవరి మీద పడితే వారు సేఫ్ అని చెప్పారు.

మొదట లైట్ శ్రీముఖి మీద పడింది. ఆ తరవాత లైట్ ఎవరి మీద పడితే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఇప్పుడు లైట్ అలీ మీద పడింది. అంతే అందరూ షాక్…ఇక నాగార్జున అలీ యు ఆర్ ఎలిమినేట్ అనగానే శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టింది. శివ జ్యోతితో మొదలయిన ఏడుపు అలీ బయటకు వచ్చేదాక ఆగలేదు. శ్రీముఖి ఆలిని గట్టిగా పట్టుకొని ఎడ్చింది. వరుణ్ సందేశ్, శివజ్యోతి, రవి, రాహుల్, బాబా భాస్కర్ అందరూ అలీని హత్తుకుని ఏడ్చేశారు. ఆ తరవాత అలీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాగార్జునను కలిశాడు. తరువాత  నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడటానికి మరో అవకాశం ఆలికి ఇచ్చారు. ఫోన్ చేసిన అలితో అందరూ ఏడుస్తూనే మాట్లాడరు. అప్పటిదాకా అనాదరితో నవ్వుకుంటూ మాట్లాడినా అలీ బాబా భాస్కర్ తో మాట్లాడినప్పుడు మాత్రం ఏడ్చేశాడు. ఇలా అలీ బిగ్ బాస్-3 నుండి నిష్క్రమించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *