ప్రియాంక గాంధీ అందంపై వివాదం..

ఐదు రాష్ట్ర్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరాది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీ వినయ్ కతియార్..సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ అందంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రియాంకతో పాటు పలువురు సినీ తారలు ఉన్నారు. దీంతో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ స్పందిస్తూ..’ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారు. ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు చాలా అందంగా ఉంటారని ఎంపీ వివాదస్పద రీతిలో మాట్లాడారు. తమ పార్టీలో అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని అన్నారు.

బాలికలను అవమానించే విధంగా జేడీయూ నాయకుడు శరద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సద్దుమణగక ముందే వినయ్ మాటలు మరో వివాదానికి తీశాయి. ప్రియాంకను అవమానిస్తూ..ఎంపీ ఇలా మాట్లాడంతో యూపీ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది. మహిళ అని చూడకుండా తమ పార్టీ లీడర్ పై అసభ్యకరంగా మాట్లడినందుకు కేంద్ర మహిళా సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. యూపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రచారకర్తగా ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషిస్తుండంతో ఆమెపై ఇలా విమర్శలు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *