అమ్మాయిగా పుట్టుంటే త్రిషలా..: విశాల్
చెన్నై: తాను అమ్మాయిలా పుట్టి ఉంటే కథానాయిక త్రిషలా జీవిస్తానని హీరో విశాల్ అన్నారు. విశాల్ గురువారం ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. తన కొత్త సినిమా విశేషాలూ, వ్యక్తిగత అభిప్రాయాలనూ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘త్రిష గురించి ఏదైనా చెప్పండి’? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ స్పందిస్తూ.. ‘నేను అమ్మాయిలా పుట్టుంటే త్రిషలా జీవించి ఉంటాను. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే వారిలో ఆమె ఒకరు’ అని సమాధానం ఇచ్చారు. దీనిపై త్రిష స్పందిస్తూ ‘నేను దీన్ని విశాల్ ఇచ్చిన ప్రశంసగా స్వీకరిస్తున్నా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
విశాల్, తమన్నా జంటగా నటించిన ‘ఒక్కడొచ్చాడు’ చిత్రం శుక్రవారం విడుదలైంది. కాగా త్రిష.. ధనుష్‌తో కలిసి నటించిన ‘ధర్మయోగి’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. త్రిష ప్రస్తుతం ‘మోహిని’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.