ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్ షో’లో పాల్గొనే వారి పేర్లు ఇవే.. పేరు తెలిస్తే దిమ్మతిరుగాల్సిందే..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ చేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందీ వెర్షన్‌లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం దక్షిణాదికి విస్తరిస్తున్నారు. తమిళంలో హోస్ట్‌గా విలక్షణ నటుడు కమల్ హాసన్ చేస్తుండగా, తెలుగులో ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పేర్లను తాజాగా స్టార్ మా టెలివిజన్ చానెల్ వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహా, రంభ, మంచు లక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *