పెళ్లైన కొత్తలో పిల్లలు వద్దనుకుంటే….

పెళ్లి అయిన సంవత్సరానికే కొత్తమంది పిల్లల్ని కనేస్తారు. మరి కొంత మంది జీవితాన్ని కాస్తంత హ్యాపిగా ఏంజాయి చేసి ఆతర్వాత పిల్లలకోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్‌లో కొత్త జంటలు ముందు వాళ్ల ఎంజాయి, డబ్బుసంపాదన, ఆతర్వాత పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.

పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి ఆతర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందు ఇప్పుడు ఏ జంటా సిద్ధంగా లేదు. మరి కొంత మంది తొందరగా పిల్లల్ని కంటే ఇప్పుడున్న ఖర్చలకు అధిక భారం అవుతుందని భావిస్తున్నారట.

చాలా యువ జంటలు వివాహమైన తర్వాత సంతానం వద్దనుకున్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటూనే గర్భనిరోధక పద్ధతులను అనుసరిస్తుంటారు. కొన్ని జంటలు ఏం చేయాలో తోచక ఇతరుల సలహాలు స్వీకరిస్తుంటారు. మరి కొంత మంది పెళ్లైన యువకులు ఒకేసారి రెండు నిరోధ్‌లు ధరించి సెక్స్‌లో పాల్గొనవచ్చా అనే సందేహలకు గురవుతుంటారు.

ప్రస్తుతం పిల్లల్ని కనకుండా ఉండాలంటే శృంగారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కొత్త జంటల్లో కొంత అనుమానాలు,అపోహలు తొలగించడానికి సెక్సాలజిస్టులు కొన్ని సలహాలు ఇస్తున్నారు అవి ఏంటి అంటే…

అడవాళ్లకు మెన్సస్‌ ప్రారంభమైన 9వరోజు నుంచి 17వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొన్న కూడదు. ఎందుకంటే అవి స్త్రీలకు అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మెన్సస్‌కు ముందు 8రోజులు, మెన్సస్‌ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

మొదటి 8రోజులు మెన్సస్‌ అయిన తర్వాత 11రోజులు సేఫ్‌ పీరియడ్‌గా చెప్పవచ్చు. ఈపద్ధతి కేవలం 28రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్‌ అయ్యే వారికి మాత్రమే. అలా కాక కొందరు 21 రోజులకు. మరి కొందరు30 రోజులకు, ఇంకొంతమంది 35,38రోజులకు పీరియడ్స్‌ వస్తుంటాయి. అటువంటి వారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం శృంగారంలో పాల్గొనాలి.

ప్రతినెల కరెక్ట్‌గా ఒకే రోజుకి మెన్సస్‌ కానివారు మెన్సస్‌ అయిన మొదటి రోజులకంటే, మెన్సస్‌కు 11రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే వారికి అది సేఫ్‌ పీరియడ్స్‌గా భావించవచ్చని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

పురుషుల విషయానికి వస్తే అంగానికి రెండు కండోమ్‌లు ధరించినట్టయితే, అంగ ప్రవేశానుభూతికి పరిమితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇది ఓ సమస్యగా మారడమే కాకుండా ఒక దానికొకటి రాపిడి జరిగి కండోమ్‌లు చిరిగి పోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సెక్స్ సమయంలో అదనపు భద్రత కావాలనుకుంటే మాత్రం భర్త కండోమ్ ధరించి, భార్య మాత్రం గర్భ నిరోధక మాత్రలను వాడితే సరిపోతుందని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *