కేసీఆర్ మర్యాద… మారిన వీహెచ్

ఎవరిని ఏ రకంగా దారి తెచ్చుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు.కాంగ్రెస్ లో తనపై విమర్శలు చేసే నాయకులను అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ అధినేత… ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వడం చూసి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. కేకే మనవడి పెళ్లిలో వీహెచ్ ను తనతో కలిసి తన అధికారిక నివాసానికి తీసుకెళ్లిన కేసీఆర్… ఆయనతో అనేక విషయాలపై చర్చించారు. కొంతసేపు కేసీఆర్ ఆయనతో రహస్య చర్చలు జరపడం కూడా అప్పట్లో కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ రేపింది. కేసీఆర్ తనకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్ మెంట్ తో ఫుల్ ఖుషీ అయిపోయిన వీహెచ్ అప్పటి నుంచి కేసీఆర్ పై విమర్శలు చేయడమే మానేశారని కొందరు కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

తరచూ అసెంబ్లీ మీడియా దగ్గరకు వచ్చి రాజకీయ ఆరోపణలు చేసే వీహెచ్… కేసీఆర్ తో సమావేశమైనప్పటి నుంచి ఆయనపై ఎలాంటి విమర్శలు చేయడం లేదట. మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి అడిగినా… దానిపై సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీహెచ్ కు ఏం మందు పెట్టారో అని కాంగ్రెస్ నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. పలువురు నేతలైతే… ఈ మధ్య కేసీఆర్ పై మీరు విమర్శలెందుకు చేయడం లేదని ఆయనను డైరెక్టర్ గా అడుగుతున్నారట. మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన స్పెషల్ ట్రీట్ మెంట్ తో వీహెచ్ వైఖరిలో మార్పు వచ్చినట్టు క్లియర్ గా అర్థమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *