ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతి.. దుర్భర జీవితం..

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంత రావు(61) సోమవారం (ఫిబ్రవరి 19,2018) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల కాలం పాటు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. గత కొంత కాలంగా హనుమంత రావు అనారోగ్యంతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. హనుమంత రావు హాస్య నటుడిగా దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు. యమలీల, పేకాట పాపారావు, ప్రేమ వంటి చిత్రాల్లో హనుమంత రావు నటించారు. ముఖ్యంగా 90 లలో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు.

హనుమంత రావు 80 వ దశకంలోనే చిత్ర పరిశ్రమకు వచ్చారు. యమలీల, పేకాట పాపారావు, ఘటోత్కచుడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాల ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.సినీ అవకాశాలు తగ్గినకమ్రంలో ఆయన అమృతం సీరియల్ ద్వారా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అమృతం సీరియల్ బుల్లి తెరపై నవ్వులు పూయించింది. హనుమంత రావు కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో దుర్భర జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో 1956లో జన్మించిన గుండు హనుమంతరావు నాటకాల మీద ఉన్న ఇష్టంతో 18 ఏళ్ల వయసులో నాటక రంగంలోకి ప్రవేశించారు. రావణబ్రహ్మ వేషంతో ఆయన పాపులర్ అయ్యారు. దాదాపు 400 సినిమాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన తొలిచిత్రం అహ నా పెళ్లంట చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న గుండు.. తర్వాతి కాలంలో చాలా సినిమాల్లో నటించారు.

బాబాయ్ హోటల్.. పేకాట పాపారావు.. అల్లరి అల్లుడు.. మాయలోడు.. యమలీల.. శుభలగ్నం.. క్రిమినల్.. అన్నమయ్య.. సమరసింహారెడ్డి.. కలిసుందాం రా.. సత్యం.. భద్రత.. ఆట.. మస్కా.. పెళ్లాం ఊరెళితే లాంటి ఎన్నో సినిమాల్లో నటించి.. తన ఎక్స్ ప్రెషన్ తో నవ్వులు పూయించారు. పలు టీవీ సీరియల్స్ లో నటించిన ఆయన.. మూడు సార్లు టీవీ నందుల్ని గెలుచుకున్నారు. అమృతం సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. గుండు హనుమంతరావుకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో భార్య.. కుమార్తె గతంలోనే చనిపోయారు. గడిచిన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో సినిమాలకు దూరమయ్యారు. గుండు హనుమంతరావు మృతికి సినీ రంగ ప్రముఖులు పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *