ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేసిన దీక్ష

బిగ్ బాస్‌ షో నుంచి గత వారం ఎలిమినేట్ అయిన దీక్ష, ధన్‌రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ధన్‌రాజ్, దీక్ష హీరో, హీరోయిన్లుగా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో ధన్‌రాజ్ ప్రవర్తన సరిగా లేదని, అందుకే అతడితో దూరంగా ఉన్నానని, ఈ కారణంగానే బిగ్ బాస్ షోలో తనకు వ్యతిరేకంగా ఉన్నాడని దీక్ష చెప్పుకొచ్చింది.

  ‘‘నా గురించి తెలియని వాళ్లు విమర్శించారు. అది పర్లేదు కానీ తెలిసినవాళ్లు కూడా విమర్శించారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. అందులో ధన్‌రాజ్ ఒకరు. నేను హౌస్‌లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి ధన్‌రాజ్ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. బయట ఎవరు ఎలాంటి వారో తెలియకపోవచ్చు.. కానీ హౌస్‌లో కెమెరాలు ఉంటాయి. ప్రతిది రికార్డు అవుతుంది. నేను సినిమా వరకే ఆయనతో మంచిగా ఉన్నా.. బయట ఎప్పుడూ కలవలేదు.
ధన్ రాజ్-దీక్ష కలిసి ‘బంతిపూల జానకి’ అనే ఓ చిన్న సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధన్ రాజ్ తనతో అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు దీక్ష వెల్లడించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. సాయంత్రం షూటింగ్ అయ్యాక ప్రత్యేకంగా కలుద్దామని చెప్పేవాడని.. ఆ యాటిట్యూడ్ తనకు నచ్చేది కాదని.. దీంతో తాను పని వరకు పరిమితమై.. అతడికి దూరంగా ఉన్నానని, క్లోజ్ కాలేదని చెప్పింది దీక్ష.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *