హైదరాబాద్‌లో స్వల్ప భూప్రకంపనలు

హైదరాబాద్: నగరంలో ఇవాళ తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే రూట్‌లో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూప్రకంపనల వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. భూమి కంపించిన ప్రాంతాల్లో ఉదయం ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *