AP. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ) బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది.సీఎం జగన్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను సభలో వివరించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్‌ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీషులో చదువుకుంటే.. పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది. కంప్యూటర్‌ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందిస్తాం’’

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *