వరంగల్ లో భారీ పేలుడు

జిల్లాలోని ఒక గ్రానైట్‌ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాజీ పేట మండలంలోని రాంపూర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *