ప్రియురాలుగా మారిన అమీర్ ఖాన్ కూతురు

పాత్ర కోసం వెండితెర మీద వీలైనంత గ్లామ‌ర్ గా క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. కానీ.. అమీర్ ఖాన్ సినిమాల్లో ఈ వ్య‌వ‌హారం భిన్నం. ఆయ‌న దంగ‌ల్ సినిమాలో అమీర్ కుమార్తెగా న‌టించిన ఫాతిమా స‌నా.. డీగ్లామ‌ర్ పాత్ర‌లోనూ చాలామందికి క‌నెక్ట్ అయ్యారు. ఈ సినిమా మొత్తం సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన స‌నా.. త‌న‌లోని గ్లామ‌ర్ కోణాన్ని బ‌య‌ట‌కు తీశారు.

దంగల్ సినిమాలో నాన్నతో కాస్త పొసకని కూతురుగా నాన్న చెప్పినట్లు చేసి అతని అడుగుజాడలలో నడిచిన అమ్మాయిగా చాల చక్కగా నటించిన ఫాతిమా ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందొస్తాన్’ సినిమాలో అమీర్ ప్రియురాలిగా నటిస్తోంది. కెరీర్ మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే దంగల్ తో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కాస్త రూట్ మరిచినట్లు ఉందిలే. గ్లామర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలే చేసిన హీరోయిన్లకే ఇక్కడ కాలం చెల్లుతుంది. అది గ్రహించి ఇప్పుడు తన యవ్వన పరువాలను ఆరబోయడానికి థగ్స్ ఆఫ్ హిందొస్తాన్ లో ఒక సెక్సీ హీరోయిన్ టైప్ లో అందాలను పరుస్తోందని ఇక్కడ ఆమె కొత్త ఫోటో షూట్ చూస్తే తెలుస్తోందిగా.

నిజానికి ఆమెకు వ‌చ్చిన ఛాన్స్‌కు ముందు.. అదే పాత్ర‌కు దీపికా ప‌దుకొణె.. శ్ర‌ద్ధాక‌పూర్‌.. అలియాభ‌ట్‌.. వాణిక‌పూర్ లాంటి స్టార్స్ ను ప‌రిశీలించి.. చివ‌ర‌కు స‌నాకు ఓటేశారు. గ్లామ‌ర్ లో వారికే మాత్రం త‌గ్గ‌ద‌న్న విష‌యాన్ని తాజా పిక్ స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *