“ఫిదా” మూవీకి బాక్స్ ఆఫీస్ ఫిదా

సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నది. సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం జూలై 21న విడుదలై మొదటి ఆట నుంచి పాజిటివ్ రివ్యూలతో అందర్నీ ఆకర్షించింది. సాయి పల్లవి నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య సాగే అంద‌మైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన ఐదు వారాల‌లో ప్రపంచ‌ వ్యాప్తంగా 45.85 కోట్ల వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం.

శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ సినీ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఎచీవ్‌మెంట్ అంటున్నారు. ఓవర్సీస్ లో ఈ మూవీ ఇప్ప‌టికే 1 మిలియ‌న్ డాలర్స్ సాధించిన‌ట్టు తెలుస్తుంది. అమెరికా అబ్బాయిగా వ‌రుణ్ తేజ్ త‌న న‌ట‌న‌తో అద‌రగొట్ట‌గా, తెలంగాణ అమ్మాయిగా భానుమతి పాత్రలో సాయిపల్లవి ఆడియెన్స్ ని ఫిదా చేసింది. అద్భుతమైన మ్యూజిక్, ఎమోషన్స్ తో ఫిదా చిత్రం అని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే మరింత కలెక్షన్స్‌ను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు .

ఏరియావైజ్‌గా ఫిదా క‌లెక్ష‌న్స్ వివ‌రాలు

Nizam :Rs 17.48 Cr
Ceded :Rs 4.04 Cr
UA :Rs 4.3 Cr
East :Rs 2.24 Cr
West :Rs 1.63 Cr
Guntur :Rs 2.42 Cr
Krishna :Rs 2.1 Cr
Nellore :Rs 0.99 Cr

5 weeks AP/TS Share:Rs 35.2 Cr

Overseas :Rs 7.85 Cr
Karnataka + Rest :Rs 2.81 Cr

5 వారాల వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : Rs 45.85 Cr

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *